Largest Screen: ఆధ్యాత్మిక నగరం తిరుపతి త్వరలోనే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డుకు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. ఆసియాలోనే అతిపెద్ద 108 అడుగుల భారీ స్క్రీన్‌తో కూడిన స్టాండ్‌అలోన్ సింగిల్ స్క్రీన్ థియేటర్ తిరుపతిలో ప్రారంభానికి వేగంగా సిద్ధమవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి' (Varanasi) తో ఈ థియేటర్ గ్రాండ్‌గా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ థియేటర్ తిరుపతి కాదు.. వైజాగ్ లో వచ్చే ఛాన్స్ ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
నో సెలబ్రిటీ స్టేక్.. కొత్త ఇన్వెస్టర్ల ధైర్యమైన అడుగు
ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ వెనుక ఎలాంటి సినిమా సెలబ్రిటీల భాగస్వామ్యం లేకపోవడం విశేషం. ఎగ్జిబిషన్ ఫీల్డ్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక యంగ్ ఇన్వెస్టర్స్ టీమ్ ఈ ల్యాండ్‌మార్క్ థియేటర్‌ను నిర్మిస్తోంది.
షాపింగ్ మాల్స్‌లోని మల్టీప్లెక్స్‌ల హవా నడుస్తున్న ఈ రోజుల్లో, కేవలం సినిమా ఎక్స్‌పీరియన్స్ కోసమే ఒక ప్యూర్ సింగిల్ స్క్రీన్‌ను ఈ స్థాయిలో నిర్మించడం టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వీ ఎపిక్ సుళ్లూరుపేట రికార్డు బ్రేక్!
గతంలో నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో వి సెల్యులాయిడ్స్ సంస్థ 'వి ఎపిక్' (V EPIQ) పేరుతో 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు ఉన్న భారీ స్క్రీన్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ప్రారంభమైన ఆ మల్టీప్లెక్స్ స్క్రీన్ అప్పట్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్‌గా రికార్డు సృష్టించింది.
ఇప్పుడు తిరుపతి (లేదా వైజాగ్)లో రాబోతున్న ఈ 108 అడుగుల స్క్రీన్ వి ఎపిక్ రికార్డును సైతం తిరగరాస్తూ ఆసియాలోనే లార్జెస్ట్ స్క్రీన్‌గా నిలవనుంది. ఇది మల్టీప్లెక్స్ కాకుండా ఒకే ఒక స్టాండ్‌అలోన్ సింగిల్ స్క్రీన్ కావడం దీని ప్రత్యేకత.
మహేష్ బాబు 'వారణాసి'తో గ్రాండ్ బిగినింగ్
{{/usCountry}}ఇప్పుడు తిరుపతి (లేదా వైజాగ్)లో రాబోతున్న ఈ 108 అడుగుల స్క్రీన్ వి ఎపిక్ రికార్డును సైతం తిరగరాస్తూ ఆసియాలోనే లార్జెస్ట్ స్క్రీన్‌గా నిలవనుంది. ఇది మల్టీప్లెక్స్ కాకుండా ఒకే ఒక స్టాండ్‌అలోన్ సింగిల్ స్క్రీన్ కావడం దీని ప్రత్యేకత.
మహేష్ బాబు 'వారణాసి'తో గ్రాండ్ బిగినింగ్
{{/usCountry}}ఈ గ్రాండ్ థియేటర్‌ను మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమాతోనే గ్రాండ్‌గా ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్ వైడ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ విజువల్ వండర్‌ను 108 అడుగుల బిగ్ స్క్రీన్‌పై చూడటం ఆడియెన్స్‌కి ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతోంది.
వరల్డ్ క్లాస్ సౌండింగ్, లేటెస్ట్ ప్రొజెక్షన్ టెక్నాలజీతో ఈ థియేటర్‌ను డిజైన్ చేస్తుండటంతో రాయలసీమ సినీ ప్రియులకు ఇది అల్టిమేట్ డెస్టినేషన్‌గా మారనుంది.
సింగిల్ స్క్రీన్ల మనుగడకి ఊపిరి.. టికెట్ రేట్లపై ఉత్కంఠ
ఓటీటీల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్న తరుణంలో, ఇలాంటి భారీ పెట్టుబడులు ఎగ్జిబిషన్ రంగానికి సరికొత్త జోష్ ఇస్తున్నాయి. తిరుపతి లాంటి ప్రధాన నగరంలో ఈ లెవల్ థియేటర్ రావడం వల్ల బిజినెస్ పరంగా కూడా టాలీవుడ్‌కి భారీ అడ్వాంటేజ్ కానుంది.
అయితే ఈ స్పెషల్ కేటగిరీ థియేటర్‌కి సంబంధించిన టికెట్ ధరల పరిమితిపై ప్రభుత్వం, ఎగ్జిబిటర్లు సుమూహ్యమైన చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన రేట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఆసియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్‌పై సినిమా చూసేందుకు తిరుపతి ప్రజలతో పాటు టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.