Jiohotstar OTT: రాధికా ఆప్టే లీడ్ రోల్ ప్లే చేసిన హాలీవుడ్ సస్పెన్స్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఏడాది తర్వాత జియోహాట్‌స్టార్‌లోకి వచ్చింది. నేడు అక్టోబర్ 21న ‘లాస్ట్ డేస్’ సినిమా ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో చూడలేకపోయిన అడ్వెంచర్, సర్వైవల్ సస్పెన్స్ ప్రియుల కోసం ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చింది.
ఏడాది తర్వాత

లాస్ట్ డేస్ మూవీ థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి రావడం గమనార్హం. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జస్టిన్ లిన్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 2025లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్ అయింది. ఆ తర్వాత అక్టోబర్ 24, 2025న అంతర్జాతీయంగా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
జియోహాట్‌స్టార్‌లోకి
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో లాస్ట్ డేస్ మూవీ ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వైవల్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. ముఖ్యంగా రాధికా ఆప్టే క్రేజ్, నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన కథ కావడంతో హాలోవీన్, పండుగల సీజన్ నేపథ్యలో ఓటీటీలో రిలీజ్ చశారు.
స్టోరీ ఇదే
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండే అండమాన్‌లోని ‘నార్త్ సెంటినల్ ఐలాండ్’ నేపథ్యంలో సాగే ఒక నిజ జీవిత గాథ. 26 ఏళ్ల అమెరికన్ మిషనరీ జాన్ అలెన్ చౌ (స్కై యాంగ్) ఆ ద్వీపంలోని గిరిజనులను కలవాలని, వారికి తన మతాన్ని బోధించాలని ప్రాణాలకు తెగించి ప్లాన్ చేస్తాడు.
అయితే ఆ ద్వీపాన్ని రక్షించడానికి, అక్కడి గిరిజనుల సంస్కృతిని కాపాడటానికి పోలీస్ అధికారి మీరా గనాలి (రాధికా ఆప్టే), స్థానిక డిటెక్టివ్ కలిసి ఇదంతా ఆపడానికి ఎలా ప్రయత్నించారు? చివరికి జాన్ చౌ ఆ ద్వీపంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ లాస్ట్ డేస్ సినిమా కథ.
ట్విస్ట్‌లు అదుర్స్
{{/usCountry}}అయితే ఆ ద్వీపాన్ని రక్షించడానికి, అక్కడి గిరిజనుల సంస్కృతిని కాపాడటానికి పోలీస్ అధికారి మీరా గనాలి (రాధికా ఆప్టే), స్థానిక డిటెక్టివ్ కలిసి ఇదంతా ఆపడానికి ఎలా ప్రయత్నించారు? చివరికి జాన్ చౌ ఆ ద్వీపంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? అనేదే ఈ లాస్ట్ డేస్ సినిమా కథ.
ట్విస్ట్‌లు అదుర్స్
{{/usCountry}}జాన్ చౌ రహస్య ప్రయాణాన్ని కనిపెట్టడానికి డిటెక్టివ్ మైండ్ గేమ్స్, దానికి రాధికా ఆప్టే పాత్ర ఇచ్చే సపోర్ట్ కథలో ఉత్కంఠను పెంచుతాయి. బయట నుంచి ఎవరు వచ్చినా బాణాలు, ఈటెలతో దాడి చేసే ఆ సెంటినలైజ్డ్ తెగ కంటపడిన జాన్ చౌ చివరి రోజుల్లో (Last Days) అనుభవించిన భయానక పరిస్థితులు గుండెల్ని పిండేస్తాయి.
ఓటీటీలో ఎందుకు చూడాలి?
2018లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జాన్ అలెన్ చౌ అనే మిషనరీ నిజ జీవిత మరణం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నార్త్ సెంటినల్ ఐలాండ్ పరిరక్షణ కోసం పోరాడే పవర్ఫుల్ పాత్రలో రాధికా ఆప్టే అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది.దట్టమైన అడవులు, ప్రమాదకరమైన సముద్ర ప్రయాణాలు, అండమాన్ పరిసరాలను దర్శకుడు జస్టిన్ లిన్ స్క్రీన్‌పై చాలా సహజంగా, థ్రిల్లింగ్‌గా చూపించారు.