...
...
Next Story

లింగ వివక్ష అంటూ జర్నలిస్ట్ పోస్ట్.. ఆయన చేసే పనిలో 1 శాతం చేసే మగాళ్లూ తక్కువే.. చిరుకు కోడలు లావణ్య త్రిపాఠి సపోర్ట్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ట్విన్స్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో తాను ఓ మనవడిని కోరుకుంటున్నానని చిరు చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ, ఇది లింగ వివక్ష అంటూ ఓ జర్నలిస్ట్ పోస్టు చేశారు. దీనిపై కోడలు లావణ్య త్రిపాఠి ఫైర్ అయింది.

Published on: Feb 4, 2026, 10:01:18 IST
Advertisement

మెగా ఫ్యామిలీలో ఇప్పుడు సంబరాలు కొనసాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ట్విన్స్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక పాప, బాబు ఉన్నారు. అయితే చిరంజీవి గతంలో మనవడు కావాలని చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ లింగ వివక్ష అంటూ ఇప్పుడు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫైర్ అయింది.

లావణ్య త్రిపాఠి ఫైర్

చిరంజీవికి సపోర్ట్ గా కోడలు లావణ్య త్రిపాఠి
చిరంజీవికి సపోర్ట్ గా కోడలు లావణ్య త్రిపాఠి

మామయ్య చిరంజీవిపై వస్తున్న లింగ వివక్ష ఆరోపణలపై లావణ్య త్రిపాఠి స్పందించింది. గతంలో చిరంజీవి తన నలుగురు మనవరాళ్ల గురించి ప్రస్తావిస్తూ ఒక మనవడిని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఒక జర్నలిస్ట్ చిరంజీవిపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనిపై లావణ్య త్రిపాఠి ఫైర్ అయింది.

1 శాతం చేసేవాళ్లూ

‘‘నా టైమ్ లైన్ లో సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోను. కానీ మీ నుంచి ఇది ఊహించలేదు. ఇది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఒక సంతోషకరమైన సందర్భాన్ని మీరు చెడగొట్టారు. ఆయన (చిరంజీవి) తన కుటుంబంలోని మహిళలను, ముఖ్యంగా మనవరాళ్లను ఎలా చూసుకుంటారో మీకు తెలీదు. ఆయన చేసేదాంట్లో 1 శాతం చేసే మగవాళ్లూ చాలా తక్కువ. నిజంగా తెలియని వారి గురించి కామెంట్ చేయకపోవడం మంచిది’’ అని లావణ్య పోస్టు చేసింది.

ట్వీట్ డిలీట్

ఆ జర్నలిస్ట్ ట్వీట్ ఇప్పుడు లేదు. డిలీట్ చేశారు. అయితే చిరంజీవి తాను మగ వారసుడిని కోరుకుంటున్నట్లు గతంలో చేసిన వ్యాఖ్యల గురించే ఆ జర్నలిస్ట్ రాసినట్లు తెలుస్తోంది. లావణ్య తన మామయ్యకు మద్దతుగా నిలవడం పట్ల ఆన్‌లైన్‌లో ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఆమె వాడిన భాష పట్ల కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి ఏమన్నారు?

2025 ఫిబ్రవరిలో ఓ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ తన మగ వారసుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘‘నలుగురు మనవరాళ్లతో కలిసి ఉంటున్నా. వుమెన్స్ హాస్టల్ వార్డెన్ లా అనిపిస్తోంది. రామ్ చరణ్, ఉపాసన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించడానికి ఒక మగ బిడ్డను కనాలి. ఈసారైనా అబ్బాయి పుట్టాలని, మన వారసత్వం కొనసాగాలని చరణ్‌కి చెప్తున్నా. మళ్లీ అమ్మాయే పుడుతుందేమోనని భయపడుతున్నా" అని చిరు నవ్వుతూనే సరదాగా అన్నారు.

మనవరాళ్లు

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు ఫస్ట్ పాప పుట్టింది. ఇక చిరు కూతుర్లయిన సుష్మిత కొణిదెలకు కుమార్తె సమర, శ్రీజ కొణిదెలకు నివ్రతి, నవిష్క అనే అమ్మాయిలున్నారు. చిరంజీవి తమ్ముడైన నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి. వీళ్లకు ఒక బాబు పుట్టాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks