న్యూ ఇయర్ వచ్చేసింది. ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీస్ ల సందడి మొదలైంది. 2026ను సినీ లవర్స్ కు మరింత ఎంటర్ టైనింగ్ గా మార్చేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ రెడీ అయ్యాయి. ఈ రోజు ఓటీటీలోకి తమిళ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్ ‘ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్’ అడుగుపెట్టింది. తెలుగులోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
ఎల్బీడబ్ల్యూ ఓటీటీ

న్యూ ఇయర్ 2026ను మరింత స్పెషల్ గా మారుస్తూ, ఓటీటీ ఆడియన్స్ కు వెల్ కమ్ చెప్తూ కొత్త వెబ్ సిరీస్ ఇవాళ (జనవరి 1) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్ సిరీస్ గురువారం ఓటీటీలో అడుగుపెట్టింది. ఇది పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
4 ఎపిసోడ్లు
ఎల్బీడబ్ల్యూ-లవ్ బియాండ్ వికెట్ సిరీస్ నాలుగు ఎపిసోడ్లతో ఓటీటీలోకి వచ్చింది. జియోహాట్‌స్టార్‌లో ఇవాళ సీజన్ 1లో నాలుగు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఈ తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జియోహాట్‌స్టార్ ఓటీటీ స్పెషల్ సిరీస్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
ఎల్బీడబ్ల్యూ స్టోరీ
ఎల్బీడబ్ల్యూ- లవ్ బియాండ్ వికెట్ సిరీస్ ఓ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో లవ్ స్టోరీ కూడా ఉంది. రంగన్ (విక్రాంత్) టాలెంట్ ఉన్న క్రికెటర్. ఇండియాకు ఆడాలని, దేశానికి గొప్ప పేరు తేవాలని కలలు కంటాడు. తన నైపుణ్యాలతో స్టార్ గా ఎదిగేలా కనిపిస్తాడు. కానీ కొన్ని కారణాలు అతణ్ని వెనక్కి లాగుతాయి. క్రికెట కెరీర్ కు ఫుల్ స్టాప్ పడేలా చేస్తాయి.
కోచ్ గా
క్రికెటర్ గా తాను అనుకున్న స్థాయికి చేరలేకపోయానని, కల నెరవేర్చుకోలేకపోయాననే బాధ రంగన్ లో ఉంటుంది. ఆ సమయంలోనే ముత్తు నగర్ అనే ఓ క్రికెట్ టీమ్ కు కోచ్ గా పనిచేసే ఛాన్స్ వస్తుంది. కానీ ఆ క్రికెట్ టీమ్ లో ఎవరికీ డిసిప్లేన్ ఉండదు. ఓ లక్ష్యం అంటూ ఉండదు. మరి ఈ క్రికెట్ టీమ్ ను రంగన్ ఎలా మార్చాడు? మధ్యలో లవ్ స్టోరీ ఏంటీ? అతని వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఏంటీ? అన్నది ఎల్బీడబ్ల్యూ సిరీస్ లో చూడాల్సిందే.
ప్రతి వారం ఎపిసోడ్
{{/usCountry}}క్రికెటర్ గా తాను అనుకున్న స్థాయికి చేరలేకపోయానని, కల నెరవేర్చుకోలేకపోయాననే బాధ రంగన్ లో ఉంటుంది. ఆ సమయంలోనే ముత్తు నగర్ అనే ఓ క్రికెట్ టీమ్ కు కోచ్ గా పనిచేసే ఛాన్స్ వస్తుంది. కానీ ఆ క్రికెట్ టీమ్ లో ఎవరికీ డిసిప్లేన్ ఉండదు. ఓ లక్ష్యం అంటూ ఉండదు. మరి ఈ క్రికెట్ టీమ్ ను రంగన్ ఎలా మార్చాడు? మధ్యలో లవ్ స్టోరీ ఏంటీ? అతని వ్యక్తిగత జీవితంలోని సమస్యలు ఏంటీ? అన్నది ఎల్బీడబ్ల్యూ సిరీస్ లో చూడాల్సిందే.
ప్రతి వారం ఎపిసోడ్
{{/usCountry}}ఎల్బీడబ్ల్యూ సిరీస్ లాంగ్ ఫార్మాట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అంటే ఈ రోజు నాలుగు ఎపిసోడ్లు వచ్చాయి. ఇక ప్రతి వారం మరో ఎపిసోడ్ రిలీజ్ అవుతుంటుంది. ఇందులో తమిళ స్టార్ విక్రాంత్ హీరో. నియతి కదంబి, సింధు శ్యామ్, హరీష్, అయాజ్ ఖాన్ తదితరులు నటించారు. ఈ సిరీస్ కు గణేష్ కార్తికేయన్ డైెరెక్టర్.