OTT Series: ఓటీటీలోకి డిఫరెంట్ జోనర్ల వెబ్ సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. తెలుగులో వేర్వేరు స్టోరీలతో వచ్చిన సిరీస్ లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సిరీస్ వచ్చేస్తోంది.
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటీటీ

సరికొత్త సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ తో ఓటీటీ లవర్స్ కు వినోదాల విందు అందిస్తున్న ఈటీవీ విన్ లో ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిరీస్ రాబోతుంది. ఇప్పటికే ఒకసారి ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 30న ఓటీటీలోకి వస్తుందని అన్నారు. కానీ తర్వాత వాయిదా వేశారు.
కొత్త డేట్ ఇదే
లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ కొత్త స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ ఇవాళ (అక్టోబర్ 3) అనౌన్స్ చేశారు. ఈ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ అక్టోబర్ 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ లో కమెడియన్ వైవా హర్ష లీడ్ రోల్ ప్లే చేశాడు.
అదిరిన ట్రైలర్
రీసెంట్ గా రిలీజ్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ అదిరిపోయింది. ఓ బ్యాచిలర్ పెళ్లి కష్టాలను ఇందులో ప్రధానంగా చూపించారు. తన కొడుకును లవ్ చేయమని అమ్మాయిలను ఆ తండ్రి అడగడం డిఫరెంట్ గా ఉంది.
ఇక ఐటీ కంపెనీలో చేరితే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారని, వాళ్లలో ఒకరిని లవ్ చేయొచ్చని ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో హీరో జాబ్ లో చేరతాడు. కానీ అక్కడ అతణ్ని ఎవరూ లవ్ చేయరు.
ఎమోషనల్ టచ్ కూడా
{{/usCountry}}ఇక ఐటీ కంపెనీలో చేరితే అమ్మాయిలు ఎక్కువగా ఉంటారని, వాళ్లలో ఒకరిని లవ్ చేయొచ్చని ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో హీరో జాబ్ లో చేరతాడు. కానీ అక్కడ అతణ్ని ఎవరూ లవ్ చేయరు.
ఎమోషనల్ టచ్ కూడా
{{/usCountry}}చివరకు హీరోకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ఆ అమ్మాయితో కలిసి హీరో ఒకే ప్లాట్ లో ఉంటాడు. కానీ ఆ అమ్మాయికి అతనంటే ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్లు టచింగ్ గా ఉన్నాయి. మొత్తంగా కామెడీతో పాటు ఎమోషనల్ గానూ ఆడియన్స్ ను అలరించేలా ఈ సిరీస్ ను రెడీ చేశారని అర్థమవుతోంది.
ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ లో వైవా హర్షతో పాటు హైపర్ ఆది, జీవన్ తదితర కమెడిన్లు కూడా కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా హైపర్ ఆది పంచ్ లు బాగా పేలుతాయనిపిస్తోంది. యూత్, ఫ్యామిలీకి ఈ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ మంచి ఆప్షన్ కానుందని చెప్పొచ్చు.