...
...
Next Story

మళ్లీ మెగాఫోన్ పట్టిన 94 ఏళ్ల లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.. త‌న క‌ల‌ల ప్రాజెక్ట్‌కు ద‌ర్శ‌క‌త్వం.. వీడియో

ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ దిగ్గజ దర్శకుల గురించి మాట్లాడితే అందులో కచ్చితంగా సింగీతం శ్రీనివాసరావు పేరు ఉంటుంది. కాలాన్ని దాటి ఆలోచించి అద్భుతమైన సినిమాలు అందించిన ఆయన ఇప్పుడు 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టారు. తన కలల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Published on: Jan 31, 2026, 18:45:55 IST
Advertisement

శనివారం (జనవరి 31) మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో SSR61 అనేది తెగ వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్ లో కనిపించింది. టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎస్ఎస్ఆర్61తో పోస్టు పంచుకున్నాడు. దీంతో రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ ఏమో అనిపించింది. కానీ ఆ తర్వాతే అసలు విషయం తెలిసింది. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్లీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు.

సింగీతం శ్రీనివాసరావు రీ ఎంట్రీ

మళ్లీ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు (x/VyjayanthiFilms)
మళ్లీ దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావు (x/VyjayanthiFilms)

సింగీతం శ్రీనివాసరావు.. ఈ పేరు వింటే తెలుగు నేలనే కాదు భారత దేశం మొత్తం గర్వంలో పులకించిపోతుంది. అద్భుతం అనే మాటనే చిన్నబోయేలా సినిమాలు తీసిన ఘనత ఆయన సొంతం. ఎవరూ ఊహించని విధంగా చిత్రాలతో ప్రయోగాలు చేశారాయన. ఇప్పుడు 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టి తన కలల సినిమాను తెరకెక్కించడానికి రెడీ అయిపోయారు.

అనౌన్స్ మెంట్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈజ్ బ్యాక్. అవును.. ఈ దిగ్గజ దర్శకుడు మళ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. 94 ఏళ్ల వయసులో సినిమాపై పిచ్చితో తన కలల చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ శనివారం అధికారికంగా ప్రకటించింది.

‘‘ఒక విజనరీ. ఒక మాస్టర్. కాలానికంటే ముందుండే ఓ జీనియస్. ఇప్పటివరకూ తెరకెక్కించని ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ తో లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు తిరిగొస్తున్నారు. ఎస్ఎస్ఆర్61- టైటిల్ ప్రకటన త్వరలోనే’’ అని క్యాప్షన్ ఇస్తూ వైజయంతీ మూవీస్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది.

సింగీతం గొప్పతనం

సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో హీరోలు, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గొప్పతానాన్ని చెప్పారు. ఆ తర్వాత నేను రిటైరవలేదనే సింగీతం వ్యాఖ్యలు హైలైట్ గా నిలిచాయి. ఆ వెంటనే కొత్త సినిమాకు సంబంధించిన ఆయన చర్చలు, దర్శకత్వం వహించే సీన్లు వీడియోలో వచ్చాయి. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

సింగీతం శ్రీనివాసరావు తీసినవి కేవలం సినిమాలు మాత్రమే కాదు. అవి కదిలే కళాఖండాలు. భైరవ ద్వీపం, మేడమ్, ఆదిత్య 369, అపూర్వ సహోదరులు, పుష్పక విమానం లాంటి ఆణిముత్యాలను తీయడం సింగీతానికే చెల్లింది. టైమ్ కంటే ముందుండే ఆయన ఆలోచనలు, క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆయన నిర్ణయాలు ఎప్పటికీ డైరెక్టర్లకు పాఠాలే. చివరగా 2013లో వెల్ కమ్ ఒబామా అనే సినిమాకు దర్శకత్వం వహించారు సింగీతం. రీసెంట్ గా ప్రభాస్ కల్కికి హెల్ప్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks