Lock Down OTT: పార్టీ తర్వాత ప్రెగ్నెంట్‌గా..ఇవాళ సైలెంట్‌గా ఓటీటీలోకి.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తమిళ స‌ర్వైవ‌ల్ థ్రిల్లర్

Lock Down OTT: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తమిళ సినిమా ఇవాళ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్ర పోషించింది. 

Published on: Mar 11, 2026, 08:40:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. ఇక ఇందులోనూ థ్రిల్లర్లు అంటే వేరే లెవల్. అలాంటి ఓ థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరే.. ‘లాక్ డౌన్’. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఈ రోజు ఓటీటీలోకి వచ్చేసింది.

ఓటీటీలోకి తమిళ సర్వైవల్ థ్రిల్లర్ (x/LycaProductions)
ఓటీటీలోకి తమిళ సర్వైవల్ థ్రిల్లర్ (x/LycaProductions)

లాక్ డౌన్ ఓటీటీ

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన మూవీ ‘లాక్ డౌన్’. ఈ తమిళ సర్వైవల్ థ్రిల్లర్ ఈ రోజు (మార్చి 11) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లాక్ డౌన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది లాక్ డౌన్ మూవీ.

తెలుగులోనూ

తమిళంలో తెరకెక్కిన లాక్ డౌన్ మూవీ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ లాక్ డౌన్ మూవీ డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు.

ఎప్పుడో రిలీజ్

నిజానికి లాక్ డౌన్ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కరోనా టైమ్, లాక్ డౌన్ నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జనవరి 30, 2026న థియేటర్లలో ఈ లాక్ డౌన్ సినిమా రిలీజైంది. అయితే మూవీ స్టోరీ పాతది కావడం, నేపథ్యం కూడా పాతదే కావడంతో సినిమా పెద్దగా జనాలకు రీచ్ కాలేకపోయింది.

నెల రోజుల తర్వాత

అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ లాక్ డౌన్ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జనవరి 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ, మార్చి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు ఎ.ఆర్.జీవా డైరెక్టర్. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

లాక్ డౌన్ స్టోరీ

అనిత (అనుపమ పరమేశ్వరన్) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటుంది. అయితే ఒక రోజు పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో జరిగిన సంఘటన వల్ల అనుకోకుండా ప్రెగ్నెంట్ అవుతుంది.

తాను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని అనిత ఇంట్లో చెప్పలేకపోతుంది. గర్భాన్ని తొలగించుకోవాలని అనుకుంటుంది. కానీ అప్పుడే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల అనిత బయటకు వెళ్లలేకపోతుంది. హాస్పిటల్స్ లో మొత్తం కరోనా పేషెంట్లనే ట్రీట్ చేస్తారు. దీంతో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచలేక, బయటకు వెళ్లలేక అనిత తీవ్ర మనోవేదనకు గురవుతుంది.

మరి చివరకు ఏం జరిగింది? అనిత ప్రెగ్నెన్సీ విషయం తెలిసిందా? ఈ సినిమాలోని మిగతా కథల ప్రాధాన్యం ఏంటీ? అన్నది లాక్ డౌన్ మూవీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More