...
...
Next Story

అల్లు అర్జున్‌తో మూవీ తర్వాత నేను చేసేది ఖైదీ 2నే.. ఆ 3 సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తా: లోకేష్ కనగరాజ్

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన ఖైదీ 2 ప్రాజెక్ట్ తోపాటు ఇతర మచ్ అవేటెడ్ సినిమాల గురించి మాట్లాడాడు. తాను అనుకున్న ఆ మూడు సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తానని స్పష్టం చేశాడు. అతడు ఇంకా ఏమన్నాడో చూడండి.

Published on: Jan 26, 2026, 14:26:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

లోకేష్ కనగరాజ్, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ఖైదీ. ఈ సినిమాకు సీక్వెల్ కూడా రావాల్సి ఉంది. అయితే దీనిని పక్కన పెట్టేసినట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా దీనిపై లోకేష్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ తో మూవీ తర్వాత తాను చేయబోయేది ఖైదీ 2నే అని స్పష్టం చేశాడు.

ఖైదీ 2తోపాటు ఆ మూడు సినిమాలు చేస్తా

అల్లు అర్జున్‌తో మూవీ తర్వాత నేను చేసేది ఖైదీ 2నే.. ఆ 3 సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తా: లోకేష్ కనగరాజ్
అల్లు అర్జున్‌తో మూవీ తర్వాత నేను చేసేది ఖైదీ 2నే.. ఆ 3 సినిమాలను కచ్చితంగా పూర్తి చేస్తా: లోకేష్ కనగరాజ్

'ఖైదీ 2' సినిమాను పక్కన పెట్టేసినట్లే అని వస్తున్న పుకార్లను లోకేష్ కనగరాజ్ పూర్తిగా ఖండించాడు. తన నెక్ట్స్ మూవీ అల్లు అర్జున్‌తోనే ఉంటుందని, ఆ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే 'ఖైదీ' సీక్వెల్ పనులు మొదలవుతాయని అతడు చెప్పాడు. కేవలం రెమ్యునరేషన్ కోసమే తాను 'ఖైదీ 2'ను ఆపేశానన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కూడా లోకేష్ వివరణ ఇచ్చాడు. ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న తన సినిమాటిక్ యూనివర్స్ గురించి మాట్లాడుతూ.. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ సినిమాలు కచ్చితంగా ఉంటాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తానని అతడు తేల్చి చెప్పాడు.

అందుకే ఆ మూవీ చేయలేదు

అంతేకాకుండా మొదట తన దర్శకత్వంలో అనుకున్న రజనీకాంత్ - కమల్ హాసన్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ గురించి, తర్వాత ఆ సినిమాకు దర్శకుడు మారడం వెనుక అసలు కారణం గురించి కూడా లోకేష్ వెల్లడించాడు. 'కూలీ' సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా చేయాలని వారు కోరడంతో, ఆ ఇద్దరు దిగ్గజ నటుల కోసం పూర్తి స్థాయి యాక్షన్ కథను సిద్ధం చేశానని లోకేష్ చెప్పాడు.

తాను ఆ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో హీరో కార్తీ వేరే సినిమాలకు ఒప్పుకోవడం వల్లే 'ఖైదీ 2' ఆలస్యం అయిందని లోకేష్ అన్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తానని తాను ముందే మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారమే ఇప్పుడు సినిమా చేస్తున్నానని చెప్పాడు.

అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే తన ఎల్.సి.యు సినిమాలను మొదలుపెడతానని చెప్పాడు. 'కూలీ' విడుదలకు ముందు కూడా లోకేష్ ఫలితంపై చాలా నమ్మకంతో ఉన్నాడు. కానీ అది భారీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఖైదీ 2 ఆగిపోలేదన్న భరోసాతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈమధ్యే కార్తీ కూడా ఖైదీ 2 మూవీపై స్పందించిన విషయం తెలిసిందే. తన వా వాతియార్ మూవీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రశ్న అడగ్గా.. దీనిపై లోకేషే స్పందిస్తాడని చెప్పాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks