LCU: కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించి ఒక సంచలన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఎల్సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) ఇక్కడితో ఆగిపోయిందని, ఇక ఈ ఫ్రాంచైజీలో కొత్త సినిమాలు రావని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. లేటెస్ట్‌గా జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ వార్తలపై లోకేష్ ఓపెన్ అవుతూ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఆఫీస్ మూసేస్తా కానీ..

ఈమధ్యే గలాటా ప్లాట్‌ఫామ్ రిలీజ్ చేసిన ఒక వీడియోలో లోకేష్ కనగరాజ్ ఇచ్చిన క్లారిటీ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతోంది. "ఎల్సీయూ ఇక ముగిసిపోయిందని బయట చాలా బజ్ నడుస్తోంది. అవసరమైతే నా జీస్క్వాడ్ (GSquad) ప్రొడక్షన్ హౌస్ అయినా మూసేస్తా కానీ ఎల్సీయూను మాత్రం ఎప్పటికీ ఆపను" అని కుండబద్దలు కొట్టాడు.
అసలు ఈ ఎల్సీయూ అనే పేరు తాను పెట్టింది కాదని లోకేష్ గుర్తుచేశాడు. ఆన్‌లైన్‌లో ఫ్యాన్స్ ముద్దుగా పెట్టుకున్న ఆ ట్యాగ్‌ను తాను అడాప్ట్ చేసుకున్నానని, దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నానని చెప్పాడు. తనకి ఎల్సీయూలో ఇంకా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు.
అల్లు అర్జున్ మూవీ తర్వాతే..
"నేను సడెన్‌గా మీడియా ముందుకు వచ్చి ఇక ఎల్సీయూలో సినిమాలు తీయను అని చెప్పలేను. కార్తితో 'ఖైదీ 2', కమల్ హాసన్ సార్‌తో 'విక్రమ్ 2', అలాగే సూర్యతో 'రోలెక్స్' స్టాండలోన్ ఫిల్మ్ అన్నీ నా అప్ కమింగ్ కమిట్మెంట్స్" అని లోకేష్ చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కచ్చితంగా సెట్స్ పైకి వెళ్తాయని ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ (AA23) పూర్తి అయిన తర్వాతే మళ్లీ ఎల్సీయూ మూవీస్ పై ఫోకస్ పెడతానని డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు. అలాగే తన ప్రొడక్షన్ లో రాబోతున్న 'బెంజ్' సినిమా కూడా ఎల్సీయూలో భాగమేనని స్పష్టం చేశాడు.
ఖైదీతో మొదలైన యూనివర్స్
{{/usCountry}}ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ (AA23) పూర్తి అయిన తర్వాతే మళ్లీ ఎల్సీయూ మూవీస్ పై ఫోకస్ పెడతానని డైరెక్టర్ కన్ఫర్మ్ చేశాడు. అలాగే తన ప్రొడక్షన్ లో రాబోతున్న 'బెంజ్' సినిమా కూడా ఎల్సీయూలో భాగమేనని స్పష్టం చేశాడు.
ఖైదీతో మొదలైన యూనివర్స్
{{/usCountry}}కార్తి హీరోగా 2019లో వచ్చిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'తో ఈ యూనివర్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2022లో కమల్ హాసన్ 'విక్రమ్', 2023లో దళపతి విజయ్ 'లియో' మూవీస్ ఈ ఫ్రాంచైజీలో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. ముఖ్యంగా 'విక్రమ్' క్లైమాక్స్‌లో సూర్య చేసిన రోలెక్స్ క్యామియో ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది.
ఇక 'బెంజ్' మూవీ విషయానికి వస్తే, భాగ్యరాజ్ కన్నన్ డైరెక్షన్ లో రాఘవ లారెన్స్, రవి మోహన్ లీడ్ రోల్స్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన 'కూలీ' (2025) సినిమాతో లోకేష్ మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కేవలం డైరెక్టర్‌గానే కాకుండా యాక్టర్‌గా కూడా లోకేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్‌లో వామికా గబ్బి హీరోయిన్‌గా వస్తున్న 'డీసీ' (DC) మూవీతో జులై 31న థియేటర్లలోకి యాక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. బన్నీ మూవీ, రోలెక్స్, ఖైదీ 2 ఇలా ఇన్ని భారీ ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉండటంతో లోకేష్ డేట్స్ దొరకడం కష్టమే అన్నది కోలీవుడ్ టు టాలీవుడ్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది.