LPG Cylinders: స్టార్ హీరోకూ తప్పని సిలిండర్ కష్టాలు.. తన భార్య రెండు ఇండక్షన్ స్టవ్‌లు ఆర్డర్ ఇచ్చిందంటూ..

LPG Cylinders: ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తన భార్య రెండు ఇండక్షన్ స్టవ్ లు ఆర్డర్ ఇచ్చిందని చెప్పాడు అక్షయ్ కుమార్. అతని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశంలో ఎల్పీజీ కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Published on: Mar 17, 2026, 19:03:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ముంబైలో ప్రస్తుతం నడుస్తున్న ఎల్‌పీజీ (LPG) సిలిండర్ల షార్టేజ్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యాడు. మంగళవారం (మార్చి 17) బీఎంసీ (BMC) హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. గ్యాస్ కష్టాలు రాకుండా తన భార్య ట్వింకిల్ ఖన్నా ఇప్పటికే రెండు ఇండక్షన్ స్టవ్‌లు కొనేసిందని నవ్వుతూ చెప్పాడు. ముంబై బీజేపీ ప్రెసిడెంట్ అమీత్ సాతంతో కలిసి బీఎంసీ లాంచ్ చేసిన 'ముంబై క్లీన్ లీగ్' ఈవెంట్‌లో అక్షయ్ స్పెషల్ గెస్ట్‌గా పాల్గొని మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు.

LPG Cylinders: స్టార్ హీరోకూ తప్పని సిలిండర్ కష్టాలు.. తన భార్య రెండు ఇండక్షన్ స్టవ్‌లు ఆర్డర్ ఇచ్చిందంటూ..
LPG Cylinders: స్టార్ హీరోకూ తప్పని సిలిండర్ కష్టాలు.. తన భార్య రెండు ఇండక్షన్ స్టవ్‌లు ఆర్డర్ ఇచ్చిందంటూ..

ఇండక్షన్ స్టవ్‌లు కొన్నాం.. మీరు కూడా తీసుకోండి!

ఫ్రీ ప్రెస్ జర్నల్ షేర్ చేసిన ఒక వీడియోలో.. మీడియాతో మాట్లాడుతున్న అక్షయ్‌ కుమార్ కు గ్యాస్ సిలిండర్ల కొరత గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి అక్షయ్ చాలా కూల్‌గా ఆన్సర్ ఇస్తూ.. "చూడండి ఇప్పటివరకు అయితే మాకు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. కానీ మొన్ననే నా భార్య.. కొత్తగా ఏదో ఓవెన్ వచ్చింది కదా, అదే ఇండక్షన్ లాంటిది, అలాంటివి రెండు కొనింది. సో గ్యాస్ అయిపోతుందనే టెన్షన్ ఎందుకు.. మీరు కూడా వెళ్లి ఓ రెండు కొనేసుకోండి" అని సరదాగా సలహా ఇచ్చాడు.

ఆ స్టవ్‌లు ఇంటికి డెలివరీ అయ్యాయా అని రిపోర్టర్లు అడిగినప్పుడు.. "ప్రస్తుతానికి ఆ విషయం నాకు ఎగ్జాక్ట్‌గా తెలియదు. కానీ నా భార్య ఆర్డర్ చేసిందని మాత్రం తెలుసు. అవి ఇంటికి వచ్చాయో లేదో నాకైతే ఇంకా క్లారిటీ లేదు" అని అక్షయ్ నవ్వుతూ బదులిచ్చాడు.

అసలు ముంబైలో ఎల్‌పీజీ క్రైసిస్ ఎందుకు వచ్చింది?

ముంబైలోని చాలా ఇళ్లు, రెస్టారెంట్లు ఇప్పుడు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఇండియాకు వచ్చే గ్యాస్ సప్లైకి పెద్ద బ్రేక్ పడింది. మన దేశానికి కావాల్సిన ఎల్‌పీజీలో దాదాపు 60 శాతం బయటి నుంచే దిగుమతి చేసుకుంటాం.

అందులో ఎక్కువ భాగం హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వస్తుంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ఇరాన్ తిరిగి ప్రతీకారం తీర్చుకునే ప్రాసెస్‌లో ఆ సముద్ర మార్గం బ్లాక్ అయిపోయిందని పీటీఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.

అక్షయ్, ట్వింకిల్ పర్సనల్ లైఫ్

అక్షయ్, ట్వింకిల్ జనవరి 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరవ్ అనే కొడుకు, నితారా అనే కూతురు ఉన్నారు. స్టార్ హీరోయిన్‌గా సినిమాలు చేసిన ట్వింకిల్.. ఆ తర్వాత రైటర్‌గా మారి 2015లో 'మిసెస్ ఫన్నీబోన్స్' అనే బుక్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్, పైజామాస్ ఆర్ ఫర్గివింగ్, వెల్కమ్ టు ప్యారడైజ్ లాంటి పాపులర్ బుక్స్ కూడా రాసి బెస్ట్ సెల్లింగ్ ఆథర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

రాబోయే అక్షయ్ కుమార్ సినిమాలు

అక్షయ్ కుమార్ లైనప్ చూసుకుంటే.. డైరెక్టర్ ప్రియదర్శన్ తీస్తున్న 'భూత్ బంగ్లా' (Bhooth Bangla) సినిమాలో అక్షయ్ మెయిన్ లీడ్‌గా చేస్తున్నాడు. ఇందులో టబు, పరేష్ రావల్ లాంటి సీనియర్లు కూడా నటిస్తున్నారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ బాలాజీ టెలీఫిల్మ్స్, అక్షయ్ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ భారీ మూవీ 2026 ఏప్రిల్ 2న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇందులో వామికా గబ్బి ఒక ముఖ్యమైన క్యారెక్టర్ చేయనుందని టాక్ నడుస్తోంది. దీంతో పాటు వెల్కమ్ టు ది జంగిల్, హేరా ఫేరి 3 సినిమాలు కూడా షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి.

ఇదే కాకుండా ప్రియదర్శన్ డైరెక్షన్‌లోనే 'హైవాన్' (Haiwaan) అనే మరో మూవీ కూడా చేస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సయామీ ఖేర్ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, దెస్పియన్ ఫిల్మ్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కూడా 2026లోనే థియేటర్లలోకి రానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More