...
...
Next Story

Samantha: ఈ సినిమాను ఎవరు చూస్తారన్నారు? ఇదే ఆన్సర్-సమంత సంచలన పోస్ట్.. 100 కోట్ల మా ఇంటి బంగారం-బేబీ బంప్ తో రియాక్షన్

Samantha: ‘మా ఇంటి బంగారం’ సరికొత్త చరిత్ర సృష్టించింది. రూ.100 కోట్ల గ్రాస్ మైల్‌స్టోన్‌ను దాటి, టాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి ‘సోలో ఫీమేల్ లీడ్’ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో బేబీ బంప్ తో ఉన్న సమంత రియాక్షన్ వైరల్ గా మారింది. ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది.

Published on: Jul 12, 2026, 17:03:51 IST
Advertisement

Samantha: దక్షిణాది సినిమా మార్కెట్ సమీకరణాలను ఒకే ఒక్క సినిమా పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు కేవలం స్టార్ హీరోల చిత్రాలకు మాత్రమే పరిమితమనుకున్న రూ.100 కోట్ల క్లబ్ రికార్డును.. సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) సాధించింది.

సమంత రియాక్షన్

ఈ సినిమాను ఎవరు చూస్తారన్నారు? ఇదే ఆన్సర్.. 100 కోట్ల మా ఇంటి బంగారం.. బేబీ బంప్ తో సమంత రియాక్షన్ వైరల్
ఈ సినిమాను ఎవరు చూస్తారన్నారు? ఇదే ఆన్సర్.. 100 కోట్ల మా ఇంటి బంగారం.. బేబీ బంప్ తో సమంత రియాక్షన్ వైరల్

సమంత హీరోయిన్ గా నటించిన మా ఇంటి బంగారం టాలీవుడ్ లో ఫస్ట్ రూ.100 కోట్ల ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. ఈ రికార్డు తెలిసిన సమంత రియాక్షన్ వైరల్ గా ఉంది. బేబీ బంప్ తో ఉన్న సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉంది. అక్కడ తన భర్త రాజ్ నిడిమోరు ఐ ప్యాడ్ లో మా ఇంటి బంగారం రూ.100 కోట్ల పోస్టర్ తో సామ్ ను సర్ ప్రైజ్ చేశాడు.

ఆ పోస్టర్ చూసి సామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత నవ్వేసింది. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూ సామ్ రాసుకొచ్చిన క్యాప్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హీరోయిన్ సినిమా ఎవరు చూస్తారు?

"సినిమా రిలీజ్‌కు ముందు నా ఫ్రెండ్ ఒకరు ఒక బి-సెంటర్ ఎగ్జిబిటర్‌కు ఫోన్ చేసి ‘మా ఇంటి బంగారం’ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయని అడిగారు. నేను లైన్‌లో ఉన్నాననే విషయం అతనికి తెలియదు. ఆ ఎగ్జిబిటర్ ఏమాత్రం ఆలోచించకుండా—‘హీరోయిన్ సినిమాను ఎవరు చూస్తారు? పెద్ద హీరోల పక్కన గ్లామర్ కోసం అయితే ఓకే.. కానీ ఒక హీరోయిన్ లీడ్ చేసే సినిమాకు ఎవరు వస్తారు? ఎవరూ రారు’ అని నిర్మొహమాటంగా చెప్పాడు" అని సమంత పేర్కొంది.

ఆన్సర్ ఇదే

ఆ అంచనాలను, అప నమ్మకాలను తలకిందులు చేస్తూ మా ఇంటి బంగారం చిత్రం సాధించిన రూ.100 కోట్ల వసూళ్లు టాలీవుడ్ కమర్షియల్ విలువలపై గట్టి దెబ్బ కొట్టాయని చెప్పాలి. సినిమా సక్సెస్ అన్నింటికీ ఆన్సర్ అని సమంత పేర్కొంది.

లాభాల పంట

నందినీ రెడ్డి మేకింగ్, రాజ్ నిడిమోరు క్రియేటివ్ పవర్‌తో ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై సమంత, హిమాంక్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన మా ఇంటి బంగారం చిత్రం ట్రేడ్ పరంగా ఒక అద్భుతం. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తో పోలిస్తే.. బాక్సాఫీస్ రన్ ముగిసే సమయానికి 300% కంటే ఎక్కువ రికవరీ సాధించి లాభాల పంట పండించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks