నటి లక్ష్మీ మంచు తాజాగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. తాను 15 ఏళ్ల వయసులో, 10వ తరగతిలో ఉన్నప్పుడు తొలిసారిగా లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె వెల్లడించింది. హాటర్ ఫ్లైతో మాట్లాడుతూ నటుడు మోహన్ బాబు కుమార్తెగా తాను చాలా సంరక్షణతో పెరిగానని, అయితే ప్రజా రవాణాలో జరిగిన ఒక అనుభవం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె పేర్కొంది.
15 ఏళ్ల వయసులో

ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ తాను 10వ తరగతిలో, కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారిగా వేధింపులకు గురైనట్లు తెలిపింది. మోహన్ బాబు కుమార్తెగా తాను సాధారణంగా డ్రైవర్, బాడీగార్డ్ లేదా తల్లితో పాటు స్కూల్‌కు వెళ్లేదాన్నని ఆమె పేర్కొన్నారు. అయితే ఒకసారి హాల్ టికెట్లు తీసుకోవడానికి స్కూల్ నుంచి వాళ్లను పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అయిన బస్ లో తీసుకెళ్లింది. ఆ సమయంలో తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని ఆమె గుర్తు చేసుకుంది. కానీ దారిలో కొందరు అపరిచితులు తనను అనుచితంగా తాకారని లక్ష్మీ తెలిపింది.
చిన్న పిల్లనని తెలుసా?
“నేను ఎదుర్కొన్న ఈ వేధింపులు, ఈ అసహ్యకరమైన అనుభూతి ఏమిటి? అప్పుడు నాకు 15 ఏళ్లు. నేను ఒక చిన్న పిల్లనని వారికి తెలుసో లేదో నాకు తెలియదు. నేను దూరంగా జరిగిపోయా. గొడవ పడలేదు. నా స్నేహితురాళ్లతో ఈ విషయం పంచుకున్నా. వారికీ ఇలాగే జరిగిందని చెప్పారు. దీనికోసం నన్ను ప్రత్యేకంగా ఎంచుకోలేదు. నేను స్పెషల్ కాదు. ఇది అందరికీ జరుగుతుంది” అని మంచు లక్ష్మి వెల్లడించింది.
కన్నీళ్లు
ఇంటర్వ్యూలో లక్ష్మీ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు చాలా సాధారణమని, ప్రజా రవాణాలో ప్రయాణించిన ఏ అమ్మాయి అయినా తనకు ఇలా జరగలేదని చెబితే అది అబద్ధమేనని చెప్పింది. మహిళా కమిషన్ విడుదల చేసిన కరపత్రంలో పేర్కొన్న ప్రతి విషయం తనకు జరిగిందని, అందుకే మీటూ ఉద్యమం సమయంలో తాను ఏడుస్తూ కుప్పకూలిపోయానని పేర్కొంది.
{{/usCountry}}ఇంటర్వ్యూలో లక్ష్మీ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ఇలాంటి సంఘటనలు చాలా సాధారణమని, ప్రజా రవాణాలో ప్రయాణించిన ఏ అమ్మాయి అయినా తనకు ఇలా జరగలేదని చెబితే అది అబద్ధమేనని చెప్పింది. మహిళా కమిషన్ విడుదల చేసిన కరపత్రంలో పేర్కొన్న ప్రతి విషయం తనకు జరిగిందని, అందుకే మీటూ ఉద్యమం సమయంలో తాను ఏడుస్తూ కుప్పకూలిపోయానని పేర్కొంది.
{{/usCountry}}“కొన్నిసార్లు పెద్ద కుటుంబం నుండి వచ్చిన వారిని ఇబ్బంది పెట్టాలని కొందరు కోరుకుంటారు. ఎందుకంటే మనం బయటకు వచ్చి చెప్పము. నా ఇంట్లో దొంగతనం జరిగితే, నేను బయటకు వచ్చి చెప్పలేను. ఆ 15,000 రూపాయలు పోతే పోనివ్వండని అనుకునేలా పెంచారు నన్ను. బయటకు వచ్చి చెప్పలేమన్నారు’’ అని లక్ష్మి తెలిపింది.