...
...
Next Story

Madhavan: మాధవన్ మాయమైపోయాడు.. నీట్ ఫర్ సేల్: సీజేపీ నిరసనల నేపథ్యంలో మాధవన్‌పై దారుణమైన ట్రోల్స్.. ఇదీ కారణం

Madhavan: ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో సినీ నటుడు మాధవన్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎఫ్‌టీఐఐ ఛైర్మన్ కూడా అయిన అతడు.. ఈ నిరసనలపై స్పందించకపోవడాన్ని స్టూడెంట్స్ తప్పుబడుతున్నారు.

Published on: Jul 22, 2026, 14:05:18 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Madhavan: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై మౌనంగా ఉన్న సీనియర్ యాక్టర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ఛైర్మన్ ఆర్. మాధవన్‌పై విద్యార్థి లోకం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. పుణేలోని ప్రసిద్ధ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆవరణలో ఉన్న ఆయన ఆఫీస్ కేబిన్ డోర్‌పై విద్యార్థులు 'గాయబ్' (కనిపించకుండా పోయారు) మీమ్స్‌తో పాటు 'నీట్ ఫర్ సేల్' పోస్టర్లను అంటించి వినూత్నంగా నిరసన తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ పిక్.. నెటిజన్ల ట్రోలింగ్

Madhavan: మాధవన్ మాయమైపోయాడు.. నీట్ ఫర్ సేల్: సీజేపీ నిరసనల నేపథ్యంలో మాధవన్‌పై దారుణమైన ట్రోల్స్.. ఇదీ కారణం (PTI)
Madhavan: మాధవన్ మాయమైపోయాడు.. నీట్ ఫర్ సేల్: సీజేపీ నిరసనల నేపథ్యంలో మాధవన్‌పై దారుణమైన ట్రోల్స్.. ఇదీ కారణం (PTI)

ఈ పోస్టర్ ఫొటో నెట్‌లో వైరల్ అవ్వగానే నెటిజన్లు, విద్యార్థులు మాధవన్‌ను ఏకిపారేస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌కు హెడ్‌గా ఉంటూ, వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారినప్పుడు స్పందించకపోవడం ఏంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.

మాధవన్ లేటెస్ట్ మూవీ 'ధురంధర్ 3' షూటింగ్, ఆయన కొడుకు వేదాంత్ స్విమ్మింగ్ కెరీర్ కోసం దుబాయ్ షిఫ్ట్ అవ్వడాన్ని టార్గెట్ చేస్తూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. "సొంత కొడుకు ఫ్యూచర్ కోసం ఇండియా వదిలి వెళ్లిన మాధవన్‌కు సాధారణ విద్యార్థుల కష్టాలు ఏం తెలుస్తాయి?" అంటూ ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.

జంతర్ మంతర్ వద్ద ఎడతెగని పోరాటం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జూన్ 6 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు జరుగుతున్నాయి. సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టగా, ఈ మధ్యే చేపట్టిన 'చలో సంసద్' మార్చ్‌తో వాతావరణం మరింత వేడెక్కింది.

ఈ విద్యార్థి ఉద్యమానికి ప్రకాష్ రాజ్, షబానా అజ్మీ, అనురాగ్ కశ్యప్, సోనమ్ బజ్వా, హనుమాన్ కైండ్, అమోల్ పరాశర్ లాంటి సినీ ప్రముఖులు నేరుగానూ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారానూ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసు బలప్రయోగం సరికాదని బహిరంగంగా ఖండించారు.

ఇలాంటి కీలక సమయంలో విద్యార్థుల పక్షాన నిలబడలేని మాధవన్ వెంటనే ఎఫ్‌టీఐఐ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం తన సినిమాల ప్రమోషన్లకు మాత్రమే బయటకు వచ్చే హీరోలు, సమాజానికి ఉపయోగపడే విషయాల్లో నోరు విప్పకపోవడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe