Mahakali: 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. తన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' (PVCU)ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ యూనివర్స్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి లేడీ సూపర్‌హీరో చిత్రం 'మహాకాళి' (Mahakali) గురించి మేకర్స్ ఒక ఆసక్తికరమైన తాజా అప్‌డేట్‌ను విడుదల చేశారు.
మహాకాళి అప్ డేట్

పూజా కొల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో కన్నడ నటి భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మహాకాళి సినిమాకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అక్షయ్ ఖన్నాను చూపిస్తూ ఉన్న ఈ పోస్టర్‌పై “ది ఎండ్ బిగిన్స్” (The End Begins) అనే క్యాప్షన్‌ను జత చేశారు.
గ్లింప్స్ రిలీజ్ డేట్
ఈ పోస్టర్ తో మహాకాళి గ్లింప్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 24, 2026న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త బయటకు రావడంతోనే ప్రశాంత్ వర్మ అభిమానులతో పాటు విభిన్నమైన సినిమాలను ఆదరించే సినీ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సుకత నెలకొంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం కూడా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ప్రశాంత్ వర్మ కథతో
పశ్చిమ బెంగాల్ సంస్కృతి, అక్కడి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మహాకాళి చిత్రానికి ప్రశాంత్ వర్మ కథను అందించారు. ఆర్‌కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ రమేష్ దుగ్గల్ అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్మరన్ సాయి స్వరాలు సమకూరుస్తున్నారు. చిత్రబృందం ఈ భారీ సోషియో-ఫాంటసీ సూపర్‌హీరో చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.
మరో ప్రయోగం
ప్రశాంత్ వర్మ రాసిన ఈ శక్తివంతమైన కథను పూజా కొల్లూరి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. భారతీయుల ఆధ్యాత్మికత, శక్తి స్వరూపిణి భావనను ఆధునిక సూపర్‌హీరో కథనానికి జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భూమి శెట్టి ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారు. అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో ఒక కీలకమైన, ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
సంక్రాంతి రేసులో 'మహాకాళి'
{{/usCountry}}ప్రశాంత్ వర్మ రాసిన ఈ శక్తివంతమైన కథను పూజా కొల్లూరి తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారు. భారతీయుల ఆధ్యాత్మికత, శక్తి స్వరూపిణి భావనను ఆధునిక సూపర్‌హీరో కథనానికి జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. భూమి శెట్టి ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందారు. అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో ఒక కీలకమైన, ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
సంక్రాంతి రేసులో 'మహాకాళి'
{{/usCountry}}ఇప్పటికే 'హనుమాన్' సినిమా సంక్రాంతికి వచ్చి ఏ స్థాయి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ 'మహాకాళి'ని కూడా 2027 సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 24న రాబోయే గ్లింప్స్ ద్వారా ఈ సినిమా విజువల్స్, కాన్సెప్ట్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయో స్పష్టత రానుంది.