ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ వారణాసి. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. ఈ చిత్రం గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రాటర్ గా తెరకెక్కుతోంది. ఈ వారణాసి సినిమాలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
వారణాసి టీజర్

తాజాగా హాలీవుడ్ మీడియాతో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా వారణాసి టీజర్ పై మహేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘‘సాధారణంగా తన సినిమా కథలను ముందే మీడియాకు చెప్తాడు రాజమౌళి. కానీ వారణాసి విషయంలో మాత్రం అలా చేయలేదు. టీజర్ తోనే కథ చెప్పాలనుకున్నాడు. ఆ ఆలోచన, ఆయన అనుకున్న విజువల్స్ విని నా మైండ్ పోయింది’’ అని మహేష్ బాబు తెలిపాడు.
ఒక ఏడాది
వారణాసి టీజర్ కోసం టీమ్ ఒక ఏడాది పాటు కష్టపడిందని మహేష్ బాబు వెల్లడించాడు. ‘‘వారణాసి కథను టీజర్ లో చెప్పాలనుకున్నారు. దీని కోసం టీమ్ ఏడాది పాటు కష్టపడింది. అందుకే టీజర్ అంత అద్భుతంగా వచ్చింది. టీజర్ లోని ప్రతి సీన్ కు కథతో కనెక్షన్ ఉంటుంది’’ అని మహేష్ చెప్పాడు. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో వారణాసి మూవీ టైటిల్, టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా తర్వాత
తన కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ పోకిరి అని మహేష్ బాబు తెలిపాడు. ‘‘పోకిరి నన్ను స్టార్ ను చేసింది. నన్ను మార్చింది. 2006లో ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ మూవీ సక్సెస్ తర్వాత నాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తర్వాత కెరీర్ లో ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారణాసితోనూ అదే స్పెషల్ ఫీలింగ్ వస్తోంది’’ అని మహేష్ చెప్పాడు.
ఆ మెసేజ్
{{/usCountry}}తన కెరీర్ ను మలుపు తిప్పిన మూవీ పోకిరి అని మహేష్ బాబు తెలిపాడు. ‘‘పోకిరి నన్ను స్టార్ ను చేసింది. నన్ను మార్చింది. 2006లో ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ మూవీ సక్సెస్ తర్వాత నాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తర్వాత కెరీర్ లో ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారణాసితోనూ అదే స్పెషల్ ఫీలింగ్ వస్తోంది’’ అని మహేష్ చెప్పాడు.
ఆ మెసేజ్
{{/usCountry}}ఇదే ఇంటర్వ్యూలో రాజమౌళి చేసిన మెసేజ్ గురించి మహేష్ బాబు వెల్లడించాడు. ‘‘ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. మీరు హీరోలను బాగా చూపిస్తారు. మీ హీరోలను మీరు ఇష్టపడతారు’’ అని రాజమౌళికి మెసేజ్ చేశానని మహేష్ చెప్పాడు. అప్పుడు రాజమౌళి ఏమో.. ‘‘కానీ నాకు విలన్స్ అంటే ఎక్కువ ఇష్టం’’ అని రిప్లే ఇచ్చాడని మహేష్ పేర్కొన్నాడు. వారణాసి మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది.