...
...
Next Story

Varanasi Set: గుడి దగ్గర డైనోసార్ ఏంటీ.. ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా జక్కన్న! వారణాసి సెట్ ఫొటో లీక్.. సోషల్ మీడియాలో ఫైర్

Varanasi Set: సోషల్ మీడియాలో ఒక్కసారిగా తుపాను రేగింది. నెటిజన్ల పోస్టులతో ఫైర్ అంటుకుంది. దీనంతటికి కారణం ఒక్క ఫొటో. అవును.. వారణాసి మూవీ సెట్ నుంచి లీకైన ఒక్క ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది. అసలు జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నాడోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

Published on: Sep 13, 2026, 14:48:22 IST
Advertisement

Varanasi Set Photo Leak: ఎంత పకడ్బంధీగా ప్లాన్ చేసినా, ఎంత సెక్యూరిటీ పెట్టినా వారణాసి మూవీకి లీక్ ల బెడద మాత్రం తప్పడం లేదు. తాజాగా వారణాసి మూవీ సెట్ నుంచి ఓ ఫొటో లీకైంది. ఇది అలాంటి ఇలాంటి ఫొటో కాదు. ఈ పిక్ సోషల్ మీడియానే ఊపేస్తోంది.

వారణాసి ఫొటో లీక్

గుడి దగ్గర డైనోసార్ ఏంటీ.. ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా జక్కన్న! వారణాసి సెట్ ఫొటో లీక్.. సోషల్ మీడియాలో ఫైర్ (x/varanasi)
గుడి దగ్గర డైనోసార్ ఏంటీ.. ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా జక్కన్న! వారణాసి సెట్ ఫొటో లీక్.. సోషల్ మీడియాలో ఫైర్ (x/varanasi)

ఎస్ఎస్ రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ ‘వారణాసి’. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తూ రెడీ అవుతున్న ఈ మూవీ సెట్ నుంచి లీకైన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ ఫొటో సోషల్ మీడియాను తగలబెట్టేస్తోంది.

పెద్ద సెట్

రాజమౌళి భారీ స్కేల్ తో దర్శకత్వం వహించే సినిమాల కోసం పెద్ద సెట్లు వేస్తుంటారు. ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ను నమ్ముకోకుండా నేచురల్ ఔట్ పుట్ కోసం సెట్లను నిర్మిస్తుంటారు. బాహుబలి సినిమాల కోసం అలాంటి సెట్లే వేశారు. ఇప్పుడు వారణాసి కోసం కూడా రాజమౌళి టీమ్ పెద్ద పెద్ద సెట్లను నిర్మించింది.

ఆ డైనోసార్ ఏంటీ?

వారణాసి సెట్ నుంచి లీకైన ఓ ఫొటో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఆ ఫొటోలో పెద్ద గుడి గోపురాలున్నాయి. అయితే ఈ ఫొటోలో పెద్ద డైనోసార్ సెట్ ఉండటం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. డైనోసార్ లతో జక్కన్న ఏం ప్లాన్ చేశాడో అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఏం ప్లాన్ చేశారు?

భూగోళం అంతా ఒకే ఖండంగా ఉన్న (ప్రాచీన పాంజియా) కాలం నాటి రష్యన్, ఆఫ్రికన్, లేదా హిమాలయ అడవుల నేపథ్యంలోని అన్వేషణ ఈ వారణాసి కథలో ఉండవచ్చని సమాచారం. ప్రాచీన నాగరికతకు, ప్రీ-హిస్టారిక్ జీవులకు మధ్య ఉన్న కనెక్షన్‌ను అన్వేషించే విదేశీ రీసెర్చర్ లేదా ట్రావెలర్ పాత్రలో మహేష్ కనిపిస్తారని ఇండస్ట్రీ టాక్.

ఇప్పటికే వారణాసి మూవీ గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రావెల్ అనే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలోనూ కనిపించనున్నాడు.

రిలీజ్ డేట్

హాలీవుడ్ నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూ.1000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో తెరకెక్కుతున్న ఈ 'వారణాసి' చిత్రం భారతీయ సినిమా స్కేల్‌ను మార్చేయనుంది. ఈ చిన్న లీక్డ్ ఫోటోతోనే సోషల్ మీడియాలో ట్రెండ్స్ బ్రేక్ అవుతుండగా, రాజమౌళి కాన్సెప్ట్ పోస్టర్ లేదా అఫీషియల్ టీజర్ రిలీజ్ చేస్తే ఆ హంగామా ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks