బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా, సౌత్ స్టార్ల ప్రశంసలతో నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది.
మహేష్ బాబు రివ్యూ

ధురంధర్ 2 సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంప్రెస్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకున్నాడు. "ధురంధర్ 2 అద్భుతంగా పేలింది! రణ్‌వీర్ సింగ్ తన అత్యుత్తమ వెర్షన్‌ను బయటపెట్టాడు. ఆదిత్య ధర్ విజన్, మేకింగ్ స్టైల్ నన్ను ఆశ్చర్యపరిచాయి. మాధవన్ యాక్టింగ్, శాశ్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి" అని మహేష్ బాటు ఎక్స్ లో రాసుకొచ్చాడు.
ఆదిత్య ధర్ మహేష్ బాబు ప్రశంసలకు స్పందిస్తూ.. "మీ మాటలకు కృతజ్ఞతలు మహేష్. ధురంధర్ ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు" అని రిప్లే ఇచ్చాడు.
ఎన్టీఆర్ కూడా
మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ధురంధర్ 2 సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు. "భారతీయ ప్రేక్షకులకు ఆదిత్య ధర్ ఒక తుఫానును అందించాడు. రణ్‌వీర్ సింగ్ తెరపై ఒక మాస్టర్ క్లాస్ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ" అంటూ చిత్ర బృందానికి తారక్ బిగ్ సల్యూట్ చేశారు.
చరిత్ర సృష్టించిన కలెక్షన్లు
{{/usCountry}}మరోవైపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ధురంధర్ 2 సినిమాపై సంచలన కామెంట్స్ చేశారు. "భారతీయ ప్రేక్షకులకు ఆదిత్య ధర్ ఒక తుఫానును అందించాడు. రణ్‌వీర్ సింగ్ తెరపై ఒక మాస్టర్ క్లాస్ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్‌లో ఆయన చూపించిన ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ" అంటూ చిత్ర బృందానికి తారక్ బిగ్ సల్యూట్ చేశారు.
చరిత్ర సృష్టించిన కలెక్షన్లు
{{/usCountry}}ధురంధర్ 2 మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.146 కోట్లు వసూలు చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇందులో ప్రివ్యూ షోల ద్వారానే రూ.43 కోట్లు రావడం విశేషం. రణ్‌వీర్ సింగ్ భారతీయ గూఢచారిగా పాకిస్థాన్ గ్యాంగ్స్‌లో చొరబడి, తన పవర్‌ను ఎలా చాటుకున్నాడనే కథాంశం ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడుతోంది.
ధురంధర్ 2 గురించి
ఆదిత్య ధర్ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ధురంధర్ 2 తెరకెక్కింది. డిసెంబర్ 5, 2025న రిలీజైన ధురంధర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా ధురంధర్ 2 ఇప్పుడు థియేటర్లకు వచ్చింది. ఇందులో రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ తదితరులు నటించారు.
రణ్‌వీర్ సింగ్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా ఒక మాస్ గూఢచారిగా, గ్యాంగ్‌స్టర్‌గా విశ్వరూపం చూపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.