...
...
Next Story

దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్- మీ ఊహకే వదిలేస్తున్నా- చేతులెత్తి దండం పెట్టడమే తెలుసు: మహేష్ బాబు

వారణాసి అప్టేడ్ చూసి మైండ్ బ్లాంక్ అయింది కదా అంటూ మహేష్ బాబు ఇచ్చిన స్పీచ్ వైరల్ గా మారింది. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ హీరోగా చేస్తున్న మూవీ టైటిల్ ను శనివారం ప్రకటించారు.

Published on: Nov 15, 2025, 22:25:32 IST
Advertisement

అప్డేట్ చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది కదా అని అన్నారు మహేష్ బాబు. ఆయన హీరోగా, రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ‘వారణాసి’. శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో ఈ మూవీ టైటిల్ ను, మహేష్ లుక్ ను రిలీజ్ చేశారు.

మహేష్ బాబు స్పీచ్

మహేష్ బాబు (jiohotstar)
మహేష్ బాబు (jiohotstar)

గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్లో వారణాసి టైటిల్ ను స్పెషల్ వీడియోతో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు స్పీచ్ వైరల్ గా మారింది.

‘‘అప్డేట్.. అప్డేట్.. అని అడిగారు కదా. ఎలా ఉంది అప్డేట్. మన డైలాగే చెప్పాలి. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయింది. నాక్కూడా అలాగే ఉంది. నాన్నగారంటే నాకెంతో గౌరవం. ఆయన ఇలాంటి క్యారెక్టర్లు చేయమని అంటుండేవారు’’ అని మహేష్ బాబు తెలిపారు.

మీ ఊహకే

ఇది కేవలం టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రమేనని మహేష్ బాబు అన్నారు. ‘‘వారణాసి రిలీజనప్పుడు మాత్రం మొత్తం ప్రపంచం గౌరవిస్తుంది. ఇది కేవలం టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ అభిమానాన్ని మాటలతో చెప్పలేను. థ్యాంక్యూ అన్నది చిన్నది మాట. చేతులెత్తి దండం పెట్టడం తప్పా నాకు ఇంకేం తెలియదు. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి’’ అని మహేష్ బాబు చెప్పారు.

ఫస్ట్ గ్లింప్స్

వారణాసి సినిమాలో రాముడి పాత్రలోనూ మహేష్ బాబు కనిపిస్తాడనే డైరెక్టర్ రాజమౌళి కామెంట్లు వైరల్ గా మారాయి. మహేష్ కు రాముడి వేషం వేసి ఫొటో షూట్ చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయని రాజమౌళి చెప్పారు. అలాగే రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాన్నే సినిమాగా తీస్తానని అనుకోలేదని కూడా రాజమౌళి పేర్కొన్నారు. వారణాసి మూవీ 2027 సమ్మర్ లో రిలీజ్ కానుందని మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks