ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ నుంచి ఓ అతిపెద్ది రివీల్ ఈ వీకెండ్ ఉండబోతోంది. దీనికోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ కూడా రెడీ చేశారు. అంతేకాదు ఈ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు జియోహాట్‌స్టార్ వెల్లడించింది.
గ్లోబ్‌ట్రాటర్ లైవ్ స్ట్రీమింగ్

రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి రాబోతున్న ఆ బిగ్గెస్ట్ రివీల్ ఏంటన్న ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతుంది. మరో నాలుగు రోజుల్లో అదేంటో తేలనుంది. ఇప్పటికే సోమవారం (నవంబర్ 10) అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచారి అనే సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ రివీల్ ఈవెంట్ ను జియోహాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. ఆ విషయాన్ని ఈ ఓటీటీ మంగళవారం (నవంబర్ 11) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“లెజెండ్స్ ఒక్కటైనప్పుడు చరిత్ర సృష్టించబడుతుంది. మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్ ట్రాటర్ గ్రాండ్ ట్రైలర్ రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నవంబర్ 15న సాయంత్రం 7 గంటల నుంచి కేవలం జియోహాట్‌స్టార్ లో..” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఈ సందర్భంగా పోస్ట్ చేసిన వీడియోలో మహేష్, ప్రియాంక, సుకుమారన్ మాట్లాడారు. రామోజీ ఫిల్మ్ సిటీలో బిగ్ రివీల్ కోసం మాతో జాయిన్ అవండి అని ప్రియాంకా చెప్పింది. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఎక్స్‌క్లూజివ్ గా జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని మహేష్ అన్నాడు.
గ్లోబ్ ట్రాటర్ నుంచి సంచారి సాంగ్
ఇక రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి సంచారి సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటను శృతి హాసన్ పాడటం విశేషం. ఇక ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించాడు. తన గత సినిమాలు, పాటలకు పూర్తి భిన్నంగా ఈ సంచారి పాటను అతడు కంపోజ్ చేశాడు. అందుకు తగినట్లే లిరిక్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. చైతన్య ప్రసాద్ ఈ పాట రాశాడు. శృతి హస్కీ వాయిస్ ఈ పాటకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
{{/usCountry}}ఇక రాజమౌళి, మహేష్ బాబు మూవీ నుంచి సంచారి సాంగ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పాటను శృతి హాసన్ పాడటం విశేషం. ఇక ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించాడు. తన గత సినిమాలు, పాటలకు పూర్తి భిన్నంగా ఈ సంచారి పాటను అతడు కంపోజ్ చేశాడు. అందుకు తగినట్లే లిరిక్స్ కూడా చాలా బలంగా ఉన్నాయి. చైతన్య ప్రసాద్ ఈ పాట రాశాడు. శృతి హస్కీ వాయిస్ ఈ పాటకు మరో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.
{{/usCountry}}