...
...
Next Story

అలా చేసే మగాళ్లకు చప్పట్లు.. ఆడవాళ్లు అయితే విమర్శలా.. హీరోయిన్ మలైకా అరోరా షాకింగ్ కామెంట్స్

విడాకులు, రెండో పెళ్లి విషయంలో సమాజం చూపే వివక్షపై బోల్డ్ హీరోయిన్ మలైకా అరోరా గళం విప్పారు. మగవారు విడాకులు తీసుకుని, వయసులో తమకంటే సగం చిన్నవారైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మెచ్చుకునే సమాజం.. స్త్రీని మాత్రం ఎందుకు విమర్శిస్తుందని ఆమె నిలదీశారు. మలైకా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇవే.

Published on: Dec 4, 2025, 18:04:12 IST
Advertisement

బాలీవుడ్ నటి మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితం గురించి, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విడాకులు, బ్రేకప్ వంటి వ్యక్తిగత విషయాల్లో మగవారిని ఒకలా, ఆడవారిని మరోలా చూసే 'ద్వంద్వ ప్రమాణాలను/వైఖరిని' (Double Standards) ఆమె ఎండగట్టారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మలైకా అరోరా.. సమాజం తీరుపై తనదైన శైలిలో స్పందించారు.

"మగవాడు చేస్తే గొప్ప.. అదే ఆడది చేస్తే తప్పా?"

అలా చేసే మగాళ్లకు చప్పట్లు.. ఆడవాళ్లకు అయితే విమర్శలా.. హీరోయిన్ మలైకా అరోరా షాకింగ్ కామెంట్స్
అలా చేసే మగాళ్లకు చప్పట్లు.. ఆడవాళ్లకు అయితే విమర్శలా.. హీరోయిన్ మలైకా అరోరా షాకింగ్ కామెంట్స్

సమాజంలో నెలకొన్న మూస ధోరణులపై మలైకా స్పందిస్తూ.. "మనం ఎంత ధైర్యంగా ఉన్నా, జనాలు మనల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఆగిపోవు. నా జీవితంలో నేను ఈ స్థాయికి రావడానికి కొంతమంది మగవారు (తండ్రి, మాజీ భర్త, స్నేహితులు వంటివారు) కూడా కారణమే, దాన్ని నేను కాదనను. కానీ, ప్రస్తుత రోజుల్లో ఒక మగవాడు విడాకులు తీసుకుని, తనకంటే సగం వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. 'వారెవ్వా! మగాడంటే ఇదీ.. ఏం ఎంజాయ్ చేస్తున్నాడురా' అని పొగిడేస్తున్నారు" అని అన్నారు.

"అదే ఒక స్త్రీ తన జీవితంలో విడాకులు తీసుకుని, కొత్తగా మరో బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంటే మాత్రం.. 'ఆమెకు అసలు బుద్ధి ఉందా? ఈ వయసులో ఎందుకిలా చేస్తోంది?' అని ప్రశ్నిస్తున్నారు. మగాడికి చప్పట్లు, ఆడవాళ్లకు విమర్శలా? ఇలాంటి మూస పద్ధతులకు, పాతకాలపు ఆలోచనలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది" అని మలైకా అరోరా ఆవేదన వ్యక్తం చేశారు.

ఎప్పుడూ వార్తల్లోనే మలైకా..

ఇప్పుడు మలైకా అరోరా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే, మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ మీడియాలో హైలెట్ అవుతుంటుంది. గతంలో నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌తో మలైకా వివాహం, ఆ తర్వాత యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్ సాగించడంతో వార్తల్లో నిలిచారు.

దాదాపు 20 ఏళ్ల పాటు కలిసి జీవించిన అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి 'అర్హాన్' అనే కుమారుడు ఉన్నాడు. విడాకుల అనంతరం మలైకా 2016 నుంచి బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నారు. అయితే, కొన్నేళ్ల రిలేషన్ తర్వాత ఇటీవలే వీరిద్దరూ విడిపోయినట్లు స్పష్టమైంది.

మరోవైపు, అర్బాజ్ ఖాన్ డిసెంబర్ 2023లో మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు అక్టోబర్ 5, 2025న తమ కుమార్తె 'సిపారా ఖాన్'కు (Sipaara Khan) జన్మనిచ్చారు. అర్బాజ్ తన జీవితంలో ముందుకు సాగి తండ్రి కూడా అయిన నేపథ్యంలో మలైకా అరైరా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe