ప్రూఫ్స్ ఇవే! బాడీ డబుల్ వివాదంపై హీరోయిన్ మాళవిక సీరియస్.. రాజాసాబ్ సెట్స్ లో అసలేం జరిగిందంటే?
ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’. ప్రస్తుతం ఓటీటీలో ఈ మూవీ అదరగొడుతోంది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ లో ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. హీరోకే కాదు హీరోయిన్ కు కూడా డూప్ వాడారని అంటున్నారు. దీనిపై హీరోయిన్ మాళవిక మోహనన్ రియాక్షన్ వైరల్ గా మారింది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ది రాజాసాబ్ మూవీపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇది రాజాసాబ్ కాదు డూప్ సాబ్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇందులో హీరోకు, హీరోయిన్ కు బాడీ డబుల్ వాడారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాళవిక మోహనన్ రియాక్టయింది.

మాళవిక మోహనన్ యాక్షన్
ప్రభాస్ హీరోగా నటించిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ది రాజాసాబ్ సినిమాలో మాళవిక మోహనన్ ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నటించింది. హీరో నానమ్మను హింసించిన రౌడీలను మాళవిక చితక్కొడుతుంది. అయితే ఈ యాక్షన్ సీన్స్ మాళవిక చేయలేదని ఆమె డూప్ చేసిందనే ట్రోల్స్ వస్తున్నాయి. రాజాసాబ్ షూటింగ్ సమయంలోని మాళవిక డూప్ ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడమే కారణం.
వీడియో ప్రూఫ్స్
రాజాసాబ్ సినిమాలో యాక్షన్ సీన్స్ మాళవిక చేయలేదని, బాడీ డబుల్ యూజ్ చేశారనే కామెంట్లు వస్తున్నాయి. వీటిపై రియాక్టయిన మాళవిక తానే యాక్షన్ సీన్స్ చేశానంటూ, ప్రూఫ్స్ గా కొన్ని వీడియోలు కూడా పోస్టు చేసింది.
‘‘ది రాజాసాబ్ సినిమాలో నేను సొంతంగా స్టంట్స్ చేశాననే ట్వీట్స్, ఆర్టికల్స్ చూశా. కానీ సినిమాలో నా స్టంట్ డబుల్ అయిన ఓ అమ్మాయి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ఇవన్నీ నా బాడీ డబుల్ చేసిందనే వార్తలూ చూశా’’ అని మాళవిక మోహనన్ ఎక్స్ లో రాసుకొచ్చింది.
నాకు యాక్షన్ అంటే ఇష్టం
‘‘ముందుగా నాకు యాక్షన్ అంటే ఇష్టం. యాక్షన్ సీన్లు చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. చిన్నప్పటి నుంచే నేను స్పోర్టీ గర్ల్ ను. నా బాడీకి ఫిజికల్ ఛాలెంజ్ ఇవ్వడాన్ని, కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని ఎంజాయ్ చేస్తా’’ అని మాళవిక పోస్టులో పేర్కొంది.
స్టంట్ డబుల్
‘‘నటీనటులే సొంతంగా యాక్షన్ సీన్లు చేస్తున్నా సెట్స్ లో స్టంట్ డబుల్ కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే రిహార్సల్స్ చేయడానికి యాక్షన్ డైరెక్టర్లు వాళ్లను రప్పిస్తారు. అలాగే కొన్ని ప్రమాదకరమైన సీన్లలోనే స్టంట్ డబుల్ ను యూజ్ చేస్తారు. ఇక్కడ నేను యాక్షన్ సీన్స్ చేస్తున్న కొన్ని వీడియోలు ఉన్నాయి’’ అని మాళవిక పోస్ట్ ఎండ్ చేసింది.
రాజాసాబ్ గురించి
ప్రభాస్ తన కెరీర్ లో చేసిన ఫస్ట్ హారర్ మూవీ ది రాజాసాబ్. సంక్రాంతి 2026 సందర్భంగా ఈ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజైంది. కానీ అంచనాలు అందుకోలేకపోయింది. రూ.400 కోట్ల బడ్జెట్ తో తీస్తే రూ.205 కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ మూవీలో ప్రభాస్, జరీనా వహాబ్, సంజయ్ దత్, మాళవిక, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమా ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


