...
...
Next Story

OTT Malayalam: ఈ మలయాళం థ్రిల్లర్ లో ఏముంది? తెగ చూసేస్తున్న తెలుగు ఆడియన్స్..ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ వన్..మీరు చూశారా?

OTT Malayalam: ఓటీటీీలో మలయాళం సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇక అందులోనూ క్రైమ్ థ్రిల్లర్లు అంటే మరో లెవల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అలాంటి ఓ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ లో ఓటీటీలో అదరగొడుతోంది. తెలుగు ఆడియన్స్ దీన్ని ఎగబడి చూసేస్తున్నారు. మరి ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటో చూసేయండి.

Published on: Jun 13, 2026, 21:51:46 IST
Advertisement

OTT Malayalam: ఓటీటీలో ప్రస్తుతం మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ‘దృఢం’ జోరు కనిపిస్తోంది. శుక్రవారం (జూన్ 12) ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ.. ఒక్క రోజులోనే ట్రెండింగ్ నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ నుంచి ఈ మూవీకి విపరీతమైన క్రేజ్ దక్కుతోంది. అసలు ఈ మూవీలో ఏముందో చూద్దాం.

ఓటీటీ ట్రెండింగ్ దృఢం

ఈ మలయాళం థ్రిల్లర్ లో ఏముంది? తెగ చూసేస్తున్న తెలుగు ఆడియన్స్..
ఈ మలయాళం థ్రిల్లర్ లో ఏముంది? తెగ చూసేస్తున్న తెలుగు ఆడియన్స్..

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ దృఢం ఓటీటీలో సత్తాచాటుతోంది. జియోహాట్‌స్టార్ లో అడుగుపెట్టిన ఈ మూవీ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ మలయాళ సినిమాకు తెలుగులోనూ క్రేజ్ దక్కుతోంది. ఇప్పుడు ఇండియాలో తెలుగులో నంబర్ వన్ మూవీగా దృఢం ట్రెండ్ అవుతోంది. అలాగే మలయాళంలోనూ టాప్ ప్లేస్ లో ఉంది.

థ్రిల్లర్ లో ఏముంది?

మలయాళంలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లు అంటే ఎప్పుడూ భారీ అంచనాలుంటాయి. ఇక దృశ్యం లాంటి సూపర్ హిట్ సస్పెన్స్ ఫ్రాంఛైజీతో అదరగొట్టిన డైరెక్టర్ జీతూ జోసెఫ్.. ఈ దృఢం మూవీని సమర్పించాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయియా. అందుకు తగ్గట్లుగానే ఓటీటీలో ఈ సినిమా మంచి థ్రిల్ పంచుతుంది.

కొత్త డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ దర్శకత్వం వహించిన దృఢం మూవీలో షేన్ నిగమ్ హీరో. ఓ హిల్ స్టేషన్ కు పోస్టింగ్ పై వెళ్లిన ఎస్సైకి ఎదురయ్యే క్రిమినల్ సవాళ్లే ఈ సినిమా. ఓ వైపు గుర్తు తెలియని శవాలు, మరోవైపు ఫైనాన్స్ కంపెనీలో దొంగతనం ఉత్కంఠ రేపుతాయి.

ఎందుకు చూడాలంటే?

మొత్తానికి దృఢం ఓ మంచి థ్రిల్ అందించే మలయాళం క్రైమ్ థ్రిల్లర్. ఈ వీకెండ్ కు థ్రిల్లర్ చూడాలనుకునే ఓటీటీ లవర్స్ ఈ మూవీపై ఓ లుక్కేయండి.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ఓటీటీ ట్రెండింగ్ లో కొనసాగుతున్న మలయాళ థ్రిల్లర్ సినిమా ఏదీ?

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ దృఢం ఓటీటీలో అదరగొడుతోంది. జియోహాట్ స్టార్ లో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది.

దృఢం సినిమాలో హీరో ఎవరు?

షేన్ నిగమ్ ఈ మలయాళ థ్రిల్లర్ దృఢం సినిమాలో హీరోగా నటించాడు.

దృఢం ఓటీటీలో ఎప్పుడు రిలీజైంది?

దృఢం మూవీ జియోహాట్ స్టార్ ఓటీటీలో జూన్ 12న రిలీజైంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks