Bhavana Dr Keerthi: తెలుగులో డాక్టర్ కీర్తిగా హీరోయిన్ భావన- టీజర్ రిలీజ్- ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే: నటి కవిత

Bhavana Dr Keerthi MBBS MS Teaser Release Event: స్టార్ హీరోయిన్ భావన నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ కీర్తి. ఎంబీబీఎస్, ఎంఎస్ అనేది సినిమా క్యాప్షన్. మలయాళంలో తెరకెక్కిన హంట్ సినిమాను తెలుగులో ఈ టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఇవాళ డాక్టర్ కీర్తి టీజర్ రిలీజ్ చేసి ఈవెంట్ నిర్వహించారు.

Published on: Apr 30, 2026, 17:42:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhavana Dr Keerthi MBBS MS Teaser Release Event: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోన్న మలయాళ స్టార్ హీరోయిన్ భావన. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా హంట్‌ను తెలుగులో "డాక్టర్ కీర్తి" అనే టైటిల్‌తో అనువాదం అవుతోంది. దీనికి ఎంబీబీఎస్ ఎంఎస్ అనేది క్యాప్షన్.

తెలుగులో డాక్టర్ కీర్తిగా హీరోయిన్ భావన- టీజర్ రిలీజ్- ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే: నటి కవిత
తెలుగులో డాక్టర్ కీర్తిగా హీరోయిన్ భావన- టీజర్ రిలీజ్- ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే: నటి కవిత

డాక్టర్ రేప్ మర్డర్ నేపథ్యంగా

గోపాలకృష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ కీర్తి సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని సంచలనం సృష్టించిన కలకత్తాలోని జరిగిన డాక్టర్ రేప్ మర్డర్ నేపథ్యంగా తెరకెక్కించారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ సినిమాస్‌తో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ్ రెడ్డి. తాజాగా ఇవాళ (ఏప్రిల్ 30) డాక్టర్ కీర్తి టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

కోల్‌కత్తాలో సంచలనం

ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్స్ స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ.. "కోల్‌కత్తాలో సంచలనం సృష్టించిన డాక్టర్ రేపు మర్డర్ కేసు ఆధారంగా మలయాళ ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము" అని అన్నారు.

"అప్పుడు జరిగిన ఆ సంఘటన పట్ల ప్రపంచం అంతా నివ్వెరపోయింది. డాక్టర్ పాత్రలో హీరోయిన్ భావన నటించారు ఆమె పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది" అని నిర్మాతలు తెలిపారు.

మే 8న రిలీజ్

"ఇక కైలాష్ మీనన్ సంగీతం సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. పీవీఆర్ ద్వారా మే 8న మా చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నాం. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" నిర్మాతలు స్వర్ణకుమారి, ఎం విశ్వనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు.

నటి కవిత మాట్లాడుతూ.. "మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులోకి గోపాలకృష్ణ గారు ఆయన టీమ్ తీసుకొస్తోంది. యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు" అని అన్నారు.

వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే

"మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్‌లో ఒక డ్యూటీ డాక్టర్‌కు ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది. ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు. షాజీ కైలాస్ గారు ఎంతో ప్రతిభ గల దర్శకులు. ఈ సినిమా చూస్తుంటే టెక్నికల్‌గా ప్రతి ఎలిమెంట్ బాగుంది" నటి కవిత పేర్కొన్నారు.

"ఇలాంటి మూవీస్‌ను పెద్ద ప్రొడ్యూసర్స్ పోటీపడి దక్కించుకుంటారు. ఈ పోటీలో గోపాలకృష్ణ గారు ఈ సినిమా దక్కించుకోవడం సంతోషకరం. గోపాలకృష్ణ గారికి, ఆయన శ్రీమతి స్వర్ణకుమారి గారికి మిగతా టీమ్ అందరికీ ఈ సినిమా మంచి విజయం అందించాలని కోరుకుంటున్నా" అని నటి కవిత చెప్పుకొచ్చారు.

మంచి విజయం అందించాలని

లీగల్ అడ్వొకేట్ ప్రభాకర్ మాట్లాడుతూ.. "డా.కీర్తి" ఎంబీబీఎస్, ఎంఎస్ సినిమా టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా గోపాలకృష్ణ గారికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More