ఓటీటీలోకి ఈ వారం అంటే డిసెంబర్ 15 నుంచి 21 మధ్య మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆసక్తికరమైన మూవీస్, వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మమ్ముట్టి నటించిన డిటెక్టివ్ థ్రిల్లర్, నివిన్ పాలీ తొలి వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తుండగా.. వివాదాల నడుమ దిలీప్, మోహన్‌లాల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఓటీటీ, థియేటర్లలో ఈ వారం మీరు చూడదగిన లేటెస్ట్ మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు ఇవే.
ఫార్మా (Pharma) - జియోహాట్‌స్టార్

మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ ఇది. దీనిని శుక్రవారం నుంచి అంటే డిసెంబర్ 19 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు. ఇదొక మెడికల్ థ్రిల్లర్. వైద్య రంగంలో జరిగే మోసాలు, అక్రమాలను ఈ సిరీస్ ద్వారా బట్టబయలు చేయనున్నారు. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సిరీస్ ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ - జీ5
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స మూవీ జీ5 ఓటీటీలోకి డిసెంబర్ 19న అడుగుపెడుతోంది. మెగాస్టార్ మమ్ముట్టి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. డొమినిక్ అనే డిటెక్టివ్ పాత్రలో మమ్ముట్టి కనిపిస్తాడు. చిన్న కేసు అనుకుని మొదలుపెట్టి.. ఒక పెద్ద మిస్టరీలో చిక్కుకునే కథాంశం ఇది. గోకుల్ సురేష్ కీలక పాత్రలో నటించాడు. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించనుంది.
బెస్టీ (Besty) - మనోరమ మ్యాక్స్
పెద్దగా తెలియని ఓ చిన్న మలయాళం సినిమా బెస్టీ. ఇప్పటికే ఈ మూవీ మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అపార్థాల వల్ల విడిపోయిన ఒక జంట కథ ఇది. ఆష్కర్ సౌదాన్, షహీన్ సిద్ధిక్ నటించారు. మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూడొచ్చు.
భ భ బ (Bha Bha Ba) - థియేట్రికల్ రిలీజ్
ఈ గురువారం (డిసెంబర్ 18) ఈ భ భ బ అనే సినిమా రిలీజ్ కానుంది. నటి వేధింపుల కేసులో నిర్దోషిగా విడుదలైన 10 రోజుల్లోనే నటుడు దిలీప్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం. సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇందులో నిడివి ఎక్కువ ఉండే గెస్ట్ రోల్ చేస్తున్నాడు. వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కూడా ఇందులో నటిస్తున్నారు. 'ప్యూర్ మ్యాడ్నెస్' అని చెప్పుకుంటున్న ఈ సినిమాపై ప్రస్తుతం కేరళలో పెద్ద చర్చ జరుగుతోంది.
{{/usCountry}}ఈ గురువారం (డిసెంబర్ 18) ఈ భ భ బ అనే సినిమా రిలీజ్ కానుంది. నటి వేధింపుల కేసులో నిర్దోషిగా విడుదలైన 10 రోజుల్లోనే నటుడు దిలీప్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం గమనార్హం. సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇందులో నిడివి ఎక్కువ ఉండే గెస్ట్ రోల్ చేస్తున్నాడు. వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కూడా ఇందులో నటిస్తున్నారు. 'ప్యూర్ మ్యాడ్నెస్' అని చెప్పుకుంటున్న ఈ సినిమాపై ప్రస్తుతం కేరళలో పెద్ద చర్చ జరుగుతోంది.
{{/usCountry}}