...
...
Next Story

ఓటీటీలో తెలుగులో మలయాళం మిస్టరీ థ్రిల్లర్ స్ట్రీమింగ్-2025లో బెస్ట్ మూవీస్‌లో ఒక‌టి-ఓ లుక్కేయండి

మలయాళం థ్రిల్లర్లకు ఓటీటీలో మంచి క్రేజ్ ఉంది. తెలుగు ఆడియన్స్ కూడా వీటిని ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఓ మలయాళ థ్రిల్లర్ ఇవాళ తెలుగులో ఓటీటీలోకి వచ్చింది. 2025లో వచ్చిన మలయాళం సినిమాల్లో ఇది బెస్ట్ అనే కామెంట్లు వస్తున్నాయి. మరి ఆ మూవీ ఏంటో చూసేయండి.

Published on: Jan 3, 2026, 20:41:26 IST
Advertisement

2025లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాయి. ఇందులో ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్లు అదరగొట్టాయి. ఇప్పుడు కొత్త ఏడాదిలోనూ ఓటీటీ లవర్స్ ను అలరించేందుకు మలయాళం సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇవాళ ఎకో అనే మలయాళం మూవీ తెలుగులో ఓటీటీలోకి వచ్చింది. 2025లో వచ్చిన బెస్ట్ మలయాళం సినిమాల్లో ఇదొకటనే కామెంట్లు వస్తున్నాయి.

తెలుగులో ఎకో ఓటీటీ

ఓటీటీలోకి తెలుగులో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి తెలుగులో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ (x)

సూపర్ హిట్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఎకో. 2025లో థియేటర్లలో అదరగొట్టింది ఈ మూవీ. రూ.5 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా రూ.50 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా డిసెంబర్ 31, 2025న పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టింది. కానీ అప్పుడు కేవలం మలయాళంలో మాత్రమే రిలీజైంది. ఇవాళ (జనవరి 3) తెలుగులోకి వచ్చేసింది.

ఈ భాషల్లో

ఇవాళ నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజైంది మిస్టరీ థ్రిల్లర్ ఎకో. నిజానికి జనవరి 7 నుంచి తెలుగు సహా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎకో సినిమాను రిలీజ్ చేస్తామని ముందు నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. కానీ ముందుగానే ఈ భాషల్లో రిలీజ్ చేసింది. ఇప్పుడు మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో ఆడియన్స్ కు థ్రిల్ పంచుతుంది ఎకో చిత్రం.

ఎకో కథ స్టోరీ

కేరళ, కర్ణాటక సరిహద్దుల్లోని అడవిలో ఉన్న ఓ ఊరిలో ఎకో కథ సాగుతుంది. కురియాచన్ అనే ఓ వ్యక్తి ఒక పెద్ద ఎస్టేట్ లో కుక్కలను పెంచుతుంటాడు. కానీ అయిదేళ్ల క్రితం అతను కనిపించకుండా పోతాడు. అతను కనిపించకుండా పోవడం మిస్టరీగా మారుతుంది. అతను చాలా మందిని మోసం చేసి పారిపోయాడని అంటారు. అతని కోసం వెతుకుతుంటారు.

మరి కురియాచన్ దొరికాడా? అతని కథ ఏంటీ? ఎస్టేట్ లోని రహస్యాలు ఏంటీ? అన్నది ఎకో సినిమాలో చూడాల్సిందే. ఈ మూవీలో సందీప్ ప్రదీప్, బియానా, వినీత్, నరైన్, సౌరభ్ తదితరులు నటించారు. దీనికి దినజిత్ అయ్యతన్ డైరెక్టర్.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks