...
...
Next Story

Malayalam OTT: ఈ వారం ఓటీటీలోని మస్ట్ వాచ్ మలయాళం సినిమాలు.. ఒకటేమో సస్పెన్స్ థ్రిల్లర్.. మరొకటి కామెడీ థ్రిల్లర్!

Malayalam OTT: ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేసేందుకు రెండు సరికొత్త మలయాళ చిత్రాలు సిద్ధమయ్యాయి. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ 'తుడక్కమ్' స్ట్రీమింగ్‌కు రానుండగా, రసవత్తర కామెడీ థ్రిల్లర్ 'ఇడి మళ కాట్టు' కూడా రిలీజ్ అవుతుంది. పూర్తి వివరాలు చూసేయండి.

Published on: Sep 16, 2026, 10:37:25 IST
Advertisement

Malayalam OTT: '2018' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రముఖ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన తాజా మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ మూవీ 'తుడక్కమ్' (Thudakkam). మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ మోహన్ లాల్ ఈ మూవీతోనే డెబ్యూ చేసింది.

తుడక్కమ్ ఓటీటీ

ఈ వారం ఓటీటీలోని మస్ట్ వాచ్ మలయాళం సినిమాలు.. ఒకటేమో సస్పెన్స్ థ్రిల్లర్.. మరొకటి కామెడీ థ్రిల్లర్!
ఈ వారం ఓటీటీలోని మస్ట్ వాచ్ మలయాళం సినిమాలు.. ఒకటేమో సస్పెన్స్ థ్రిల్లర్.. మరొకటి కామెడీ థ్రిల్లర్!

ఈ వారం ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన మలయాళం సినిమాల్లో తుడక్కమ్ ఒకటి. ఈ సినిమా సెప్టెంబర్ 18, 2026 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్‌ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది. విస్మయ మోహన్‌లాల్, ఆశిష్ జో ఆంటోనీ, బాబీ కురియన్, సాయి కుమార్, మనోజ్ కె. జయన్, చిప్పి రంజిత్, కొట్టాయం రమేష్ తదితరులు నటించారు.

స్టోరీ ఇదే

కూతురు విస్మయ డెబ్యూ సినిమా అయిన తుడక్కహ్ లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రత్యేక కామియో పాత్రలో కనిపించనుండటం విశేషం. పాఠశాల విద్యార్థినులను సురక్షితంగా ఇంటికి చేర్చిన మీను అనే ముయ్ థాయ్ (Muay Thai) మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని చుట్టూ కథ సాగుతుంది.

ఆమె జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి ప్రవేశించడం, ఆ తర్వాత ఆమె అకస్మాత్తుగా మాయమవ్వడం ఉత్కంఠ రేపుతాయి. తనను, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆ యువతి మార్షల్ ఆర్ట్స్ విద్యతో చేసిన పోరాటాన్ని ఈ మూవీలో సూపర్ గా చూపించారు.

కామెడీ థ్రిల్లర్

పశ్చిమ బెంగాల్ నుంచి పని కోసం కేరళకు వచ్చిన సౌగద అనే వలస కార్మిక యువతి వస్తువులు దొంగతనానికి గురవుతాయి. తన సామాన్ల వెతుకులాటలో భాగంగా కేరళలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు విభిన్న వ్యక్తులతో ఆమె కలిసి ప్రయాణించడం ఈ సినిమా కథాంశం. వలస కార్మికుల సమస్యలు, ఐక్యతను నవ్వుల విందుగా ఈ చిత్రంలో చూపించారు.

మలయాళ థ్రిల్లర్ల క్రేజ్

దక్షిణాది ఓటీటీ మార్కెట్‌లో మలయాళ కంటెంట్‌కు, ముఖ్యంగా క్రైమ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్లకు విశేషమైన ఆదరణ ఉంది. అందుకే తుడక్కమ్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక శ్రీనాథ్ భాసి, చెంబన్ వినోద్ వంటి పవర్‌హౌస్ పెర్ఫార్మర్లు ఇడి మళ కట్టులో ఉండటం వల్ల ఈ కామెడీ థ్రిల్లర్‌కు క్రేజ్ దక్కే అవకాశముంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks