...
...
Next Story

దిగ్గజ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత- విషాదంలో సినీ లోకం- హీరో ధ్యాన్ శ్రీనివాసన్ తండ్రి ప్రస్థానం ఇదే!

మలయాళ వెండితెర దిగ్గజం, విలక్షణ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ (69) శనివారం (డిసెంబర్ 20) ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. దీంతో మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది.

Published on: Dec 20, 2025, 11:25:17 IST
Advertisement

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. దిగ్గజ నటుడు, డైరెక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీనివాసన్ శనివారం (డిసెంబర్ 20) ఉదయం కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

దిగ్గజ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత- విషాదంలో సినీ లోకం- హీరో ధ్యాన్ శ్రీనివాసన్ తండ్రి ప్రస్థానం ఇదే!
దిగ్గజ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత- విషాదంలో సినీ లోకం- హీరో ధ్యాన్ శ్రీనివాసన్ తండ్రి ప్రస్థానం ఇదే!

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో మరణించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం రాత్రి త్రిప్పుణితురలోని ఆసుపత్రిలో చేరిన శ్రీనివాసన్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

సామాన్యుడి గొంతుకగా శ్రీనివాసన్

కన్నూరుకు చెందిన శ్రీనివాసన్ గత కొన్నేళ్లుగా కొచ్చిలోనే నివసించారు. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా మలయాళ సినిమా గమనాన్ని మార్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది.

మధ్యతరగతి ప్రజల కష్టాలను, సామాజిక వైరుధ్యాలను తన సినిమాల్లో ఎంతో సహజంగా, వ్యంగ్యంగా చూపించడం శ్రీనివాసన్ శైలి. శ్రీనివాసన్‌కు ఇద్దరు కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ కూడా సినీ రంగంలోనే రాణిస్తున్నారు. ధ్యాన్ శ్రీనివాసన్‌కు మాలీవుడ్‌లో హీరోగా సూపర్ క్రేజ్ ఉంది.

అపురూపమైన సినీ ప్రస్థానం

1976లో ‘మణిముజక్కమ్’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన శ్రీనివాసన్ దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. చెన్నైలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన ఆయన 1979లో వచ్చిన ‘సంఘగానం’తో హీరోగా మారారు. 80, 90వ దశకాల్లో మలయాళం చూసిన ఎన్నో క్లాసిక్ సినిమాలకు ఆయనే కర్త, కర్మ, క్రియ.

అవార్డుల పంట.. అరుదైన గుర్తింపు

దర్శకుడిగా కూడా శ్రీనివాసన్ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాసి, దర్శకత్వం వహించిన 'వడక్కునొక్కియంత్రం' (1989) ఉత్తమ చిత్రంగా కేరళ రాష్ట్ర అవార్డును గెలుచుకుంది. అలాగే 'చింతవిష్టయాయ శ్యామల' (1998) సినిమాకు సామాజిక అంశాల విభాగంలో జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం లభించింది. స్క్రీన్ ప్లే రచయితగా శ్రీనివాసన్ రెండుసార్లు కేరళ రాష్ట్ర అవార్డులు అందుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks