Kappi Squad Director: మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సరికొత్త వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించడం ప్రారంభించిన రెండు రోజులకే ఓ యువ డైరెక్టర్ అనంత లోకాలకు వెళ్లిపోయారు. ప్రముఖ మలయాళ వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్' (Kappi Squad) దర్శకుడు బెల్రాజ్ కలరిక్కల్ (27) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అక్టోబర్ 17, 2026 శనివారం నాడు కొచ్చిలోని ఒక హోటల్ గదిలో ఆయన మరణించారు.
మలయాళ డైరెక్టర్ కన్నుమూత

కేవలం 27 సంవత్సరాల వయసులోనే బెల్రాజ్ కలరిక్కల్ మరణించడం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శనివారం కొచ్చిలోని ఒక హోటల్ రూమ్లో ఆయన అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా చిన్న వయసులోనే కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది.
రెండు రోజుల క్రితమే సిరీస్ రిలీజ్
బెల్రాజ్ కలరిక్కల్, శ్రీకాంత్ మోహన్లతో కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'కప్పి స్క్వాడ్'. శ్రీకాంత్ మోహన్ క్రియేటర్గా వ్యవహరించిన ఈ సిరీస్.. సరిగ్గా రెండు రోజుల క్రితమే, అంటే అక్టోబర్ 15, 2026న 'జియోహాట్స్టార్' (JioHotstar) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఒకవైపు సిరీస్కు మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలోనే, దర్శకుడు మరణించడంతో 'కప్పి స్క్వాడ్' టీమ్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయాణం
దర్శకుడిగా మారడానికి ముందు బెల్రాజ్ కలరిక్కల్ మలయాళ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా సుదీర్ఘ కాలం పనిచేశారు. మలయాళంలో మంచి విజయం సాధించిన 'నిజల్' (Nizhal), 'మధురం' (Madhuram), 'డాకిని' (Dakini) వంటి చిత్రాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎంతోమంది సీనియర్ దర్శకుల వద్ద మెళకువలు నేర్చుకుని, మెగా ప్రాజెక్ట్ 'కప్పి స్క్వాడ్' ద్వారా స్వతంత్ర దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు.
చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి
బెల్రాజ్ ఆకస్మిక మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిభ ఉన్న యువ దర్శకుడిని కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటని సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
{{/usCountry}}బెల్రాజ్ ఆకస్మిక మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రతిభ ఉన్న యువ దర్శకుడిని కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటని సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.
{{/usCountry}}కప్పి స్క్వాడ్ సిరీస్ ను 100 ఎపిసోడ్ల సిరీస్ గా మేకర్స్ ప్లాన్ చేశారు. దీన్ని వీక్లీ సిరీస్ గా తెరకెక్కించారు. ప్రతి గురువారం 4 ఎపిసోడ్లు ఓటీటీలో రిలీజ్ అవుతాయి.