Mamitha Baiju: కేరళలో థియేటర్ల బయట సినిమాలు రివ్యూలు చెప్తూ 'ఆరాట్టు అన్నన్' (Aarattu Annan) గా పాపులర్ అయిన సంతోష్ వర్కీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మమితా బైజును పెళ్లి చేసుకుంటానంటూ అతను పెట్టిన ఫేస్ బుక్ పోస్టు కాంట్రవర్సీకి తెరతీసింది.
మమితాను పెళ్లి చేసుకుంటా

‘‘మమితా బైజూను ప్రేమిస్తున్నా. మమితాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మూడోసారి బెత్లెహెం కుడుంబ యూనిట్ మూవీ చూశా. మా మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ నాకు మమితంటే ఇష్టం. ఆమెనే పెళ్లి చేసుకుంటా. ఆమె కాకుండా మరో మహిళకు నా జీవితంలో చోటు లేదు’’ అని సంతోష్ పోస్టు పెట్టాడు.
పోస్టు వైరల్
యంగ్ సెన్సేషన్ మమితా బైజు గురించి సంతోష్ పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంతోష్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మమితా అభిమానులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం హీరోయిన్ల పేర్లు వాడటం మానేయమని హెచ్చరిస్తున్నారు.
అప్పుడు నిత్యా మీనన్
గతంలోనూ సంతోష్ పేరు వివాదాల్లో వినిపించింది. నిత్యా మీనన్ ను పెళ్లి చేసుకుంటానని అతను తరచూ చెప్తుండేవాడు. సంతోష్ తనను వేధించాడని స్వయంగా నిత్యా మీనన్ ఆరోపించింది. 30 ఫోన్ నెంబర్స్ నుంచి కాల్ చేసి విసిగించేవాడని పేర్కొంది.
మమితా బైజు జోరు
మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'ప్రేమలు' చిత్రంతో మమితా బైజు ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు, తమిళ ఆడియన్స్‌లో ఆమెకు విశేషమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.
బ్లాక్ బస్టర్ హిట్లు
మమితా బైజు టైమ్ మామూలుగా లేదు. ఆమె సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో రిలీజైన మూడు సినిమాలు ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేశాయి. ఈ రికార్డు సాధించిన ఫస్ట్ హీరోయిన్ గా మమితా హిస్టరీ క్రియేట్ చేసింది.
మూడు సినిమాలు
{{/usCountry}}మమితా బైజు టైమ్ మామూలుగా లేదు. ఆమె సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో రిలీజైన మూడు సినిమాలు ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేశాయి. ఈ రికార్డు సాధించిన ఫస్ట్ హీరోయిన్ గా మమితా హిస్టరీ క్రియేట్ చేసింది.
మూడు సినిమాలు
{{/usCountry}}విజయ్ దళపతి లాస్ట్ మూవీ ‘జన నాయగన్’లో మమితా కీ రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత సూర్య హీరోగా వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ మూవీతో క్యూట్ యాక్టింగ్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది.