...
...
Next Story

రప్ఫాడించిన చిరంజీవి-మన శంకర వరప్రసాద్ గారు ఓపెనింగ్ కలెక్షన్లు-మెగాస్టార్ కెరీర్‌లోనే సెకండ్ హైయ్య‌స్ట్‌

మెగాస్టార్ చిరంజీవి రప్ఫాడించారు. చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఓపెనింగ్ కలెక్షన్లలో అదరగొట్టింది. చిరు కెరీర్ లోనే సెకండ్ హైయ్యస్ట్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది.

Published on: Jan 13, 2026, 11:29:51 IST
Advertisement

బాస్ ఈజ్ బ్యాక్.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూసిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ అంటున్న మాట ఇది. అవును.. కలెక్షన్ల రికార్డుల్లోనూ బాస్ ఈజ్ బ్యాక్. మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు రికార్డు ఓపెనింగ్ కలెక్షన్లు వచ్చాయి. ప్రీమియర్లు, ఫస్ట్ డే కలిపి ప్రపంచవ్యాప్తంగా మన శంకర వరప్రసాద్ గారు అదిరే వసూళ్లు రాబట్టింది. చిరు కెరీర్ లోనే ఇది సెకండ్ హైయ్యస్ట్.

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు

మన శంకర వరప్రసాద్ గారు మూవీలో చిరంజీవి (x/Shine_Screens)
మన శంకర వరప్రసాద్ గారు మూవీలో చిరంజీవి (x/Shine_Screens)

చిరంజీవి హీరోగా సంక్రాంతి 2026కు రిలీజైన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. జనవరి 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. బ్లాక్ బస్టర్ టాక్ తో మూవీ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

బాక్సాఫీస్ బద్దలు

‘‘మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ బద్దలు కొట్టేశారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రీమియర్స్ ప్లస్ డే 1 కలిపి ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల గ్రాస్ వచ్చింది. ప్రతి దగ్గర ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్. మెగా బ్లాక్ బస్టర్’’ అని షైన్ స్క్రీన్ ట్విటర్ లో పోస్టు చేసింది.

సెకండ్ హైయ్యస్ట్

హిట్ మెషిన్ గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఖాతాలో వరుసగా తొమ్మిదో హిట్ చేరింది. ఆయన చేసిన సినిమాలన్నీ మన శంకర వరప్రసాద్ గారుతో సహా అన్నీ హిట్లే. ఒక్క ఫ్లాప్ అంటూ లేదు. గతేడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్.. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారుతో మ్యాజిక్ రిపీట్ చేశాడు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార, కేథరీన్, వెంకటేశ్, హర్షవర్ధన్ తదితరులు నటించారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe