ఇది మెగా ఓటీటీ బ్లాస్ట్.. మన శంకరవరప్రసాద్ గారు 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు..

మెగాస్టార్ చిరంజీవి ర్యాంపేజ్ ఓటీటీలోనూ కొనసాగుతోంది. అతడు నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై దుమ్ము రేపుతోంది. బాక్సాఫీస్ కంటే మించిన రికార్డుతో దూసుకెళ్తోంది.

Published on: Feb 13, 2026, 14:00:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెగాస్టారా మజాకా? 70 ఏళ్ల వయసులోనూ ఇండస్ట్రీ రికార్డులనే కాదు.. ఓటీటీ రికార్డులను కూడా తిరగరాసేస్తున్నాడు చిరంజీవి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరు నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టిన 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ తో ఊహకందని రికార్డును సొంతం చేసుకుంది.

ఇది మెగా ఓటీటీ బ్లాస్ట్.. మన శంకరవరప్రసాద్ గారు 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు..
ఇది మెగా ఓటీటీ బ్లాస్ట్.. మన శంకరవరప్రసాద్ గారు 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు..

జీ5 ఓటీటీలో మెగాస్టార్ ర్యాంపేజ్

ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన మూవీ మన శంకరవరప్రసాద్ గారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.375 కోట్లకుపైగా వసూలు చేసి చిరు కెరీర్లోనే అత్యధిక వసూళ్ల సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర అంతలా చెలరేగుతున్నా నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొచ్చి మేకర్స్ ఆశ్చర్యపరిచారు. జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే 24 గంటల్లోనే ఈ మూవీ 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు సాధించినట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ.. జీ5 ఓటీటీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ అని వెల్లడించింది. గతంలో ఆర్ఆర్ఆర్ లాంటి మూవీకి కూడా ఈ ఓటీటీలో సాధ్యం కాని రికార్డు ఇది. దీనిని బట్టి మన శంకరవరప్రసాద్ గారు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మన శంకరవరప్రసాద్ గారు విశేషాలు

గతేడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈసారి చిరంజీవితో ఈ మన శంకరవరప్రసాద్ గారుతో వచ్చాడు. అంచనాలు భారీగానే ఉన్నా.. వాటన్నింటినీ మించిపోయి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది ఈ సినిమా. చిరు, నయనతార జోడీ.. వెంకటేశ్ కామియో రోల్ ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. చాలా రోజుల తర్వాత చిరంజీవి మార్క్ కామెడీని ఇందులో చూడొచ్చు.

థియేటర్లలో ఇంతటి భారీ విజయం సాధించిన సినిమాపై సహజంగానే ఓటీటీలోనూ అంచనాలు భారీగానే ఉంటాయి. జీ5 ఓటీటీకి ఇప్పుడదే కలిసి వస్తోంది. ఈ సినిమాను ఏకంగా ఏడు భాషల్లో తీసుకొచ్చిన ఈ ఓటీటీకి వ్యూయర్స్ క్యూ కడుతున్నారు. కేవలం 24 గంటల్లోనే 200 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అంటే మామూలు విషయం కాదు. రానున్న రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులు తిరగ రాయడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More