మెగాస్టార్ చిరంజీవి దూకుడు మామూలుగా లేదు. మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లలో రూ.380 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించగా.. ఇప్పుడు ఓటీటీలోనూ 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు మూవీ ఇదే.
మన శంకరవరప్రసాద్ గారు@500 మిలియన్

అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు జీ5 ఓటీటీలో 500 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “మెగా 500 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్.. ది మెగా విక్టోరియస్ బ్లాక్‌బస్టర్ అన్‌స్టాపబుల్. మన శంకరవరప్రసాద్ గారు ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఇదే ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆర్ఆర్ఆర్ కూడా ఈ మార్క్ అందుకుంది. ఈ రెండు తెలుగు సినిమాలు కాకుండా అజిత్ నటించిన వలీమై మూవీ కూడా 500 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డులో చేరింది. మన శంకరవప్రసాద్ గారు జీ5 ఓటీటీలో ఏకంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా ఈ రికార్డుకు ఓ కారణమైంది.
ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తొలి 24 గంటల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్, తొలి వారం 300 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా 500 మార్క్ అందుకొని మరో రికార్డును క్రియేట్ చేసింది.
బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 380 కోట్లకుపైగా..
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 380 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే దాదాపు 5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.
{{/usCountry}}ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 380 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసింది. ఒక్క అమెరికాలోనే దాదాపు 5 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది.
{{/usCountry}}అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఇందులో చిరంజీవి ఒక సెక్యూరిటీ ఏజెంట్ పాత్రలో కనిపిస్తాడు. తన మాజీ భార్య (నయనతార) కోరిక మేరకు రాజకీయంగా ఎంతో శక్తివంతుడైన ఆమె తండ్రిని రక్షించడానికి అతడు తిరిగి వస్తాడు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తన భార్య ప్రేమను మళ్ళీ ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ. క్లీన్ ఫ్యామిలీ కంటెంట్ కావడంతో కుటుంబ ప్రేక్షకులు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు జీ5 ఓటీటీలో మూవీని చూడొచ్చు. అంతేకాదు ఫిబ్రవరి 28న సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో వరల్డ్ టీవీ ప్రీమియర్ కూడా కాబోతోంది.