సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu). మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా.. ఇప్పుడు టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఈ మధ్య ఏ సినిమాను అయినా ఒకేసారి అటు ఓటీటీ, ఇటు టీవీలోకి తీసుకొస్తున్న జీ నెట్‌వర్క్ ఈ మన శంకరవరప్రసాద్ గారు విషయంలో మాత్రం ఓటీటీ ప్రీమియర్ తర్వాత కాస్త ఆలస్యంగా టీవీలోకి తెస్తోంది.
మన శంకరవరప్రసాద్ గారు వరల్డ్ టీవీ ప్రీమియర్

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్-కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. థియేటర్లలోనే కాదు జీ5 ఓటీటీలోనూ రికార్డుల దుమ్ము దులిపింది. ఇప్పుడీ 'మన శంకర వర ప్రసాద్ గారు' మూవీ జీ తెలుగు (Zee Telugu) ఛానెల్‌లో ఈ శనివారం అంటే ఫిబ్రవరి 28న సాయంత్రం 5:30 గంటలకు ప్రీమియర్ కానుంది. ఇప్పటి వరకూ థియేటర్లలో, ఓటీటీలో చూడని వాళ్లకు ఇది మంచి అవకాశం.
ఓటీటీలో దూసుకుపోతున్న మెగా ఎంటర్‌టైనర్
మన శంకరవరప్రసాద్ గారు ఫిబ్రవరి 11నే జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 500 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినట్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఇంకా జోరు తగ్గలేదు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాలో శంకర వర ప్రసాద్‌గా మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రను పోషించగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార, ఒక ప్రముఖ పాత్రలో విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, క్యాథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్ తదితరులు అత్యద్భుతమైన నటనను కనబరిచారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన అద్భుతమైన సంగీతం, సమీర్ రెడ్డి కెమెరా పనితనం, తమ్మిరాజు షార్ప్ ఎడిటింగ్ ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లాయి. ప్రస్తుతం జీ5 ఓటీటీలో తెలుగు సహా ఏడు భాషల్లో మన శంకరవరప్రసాద్ గారు స్ట్రీమింగ్ అవుతోంది. టీవీలో చూడాలనుకుంటే ఈ శనివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో చూడొచ్చు.
{{/usCountry}}సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన అద్భుతమైన సంగీతం, సమీర్ రెడ్డి కెమెరా పనితనం, తమ్మిరాజు షార్ప్ ఎడిటింగ్ ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను మరో లెవెల్ కు తీసుకువెళ్లాయి. ప్రస్తుతం జీ5 ఓటీటీలో తెలుగు సహా ఏడు భాషల్లో మన శంకరవరప్రసాద్ గారు స్ట్రీమింగ్ అవుతోంది. టీవీలో చూడాలనుకుంటే ఈ శనివారం సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో చూడొచ్చు.
{{/usCountry}}