Meghamsh: శ్రీహరి అంకుల్ మమ్మల్ని ఎత్తుకుని పెంచారు, నేను మేఘాంశ్‌ని ఎత్తుకున్నా: మంచు మనోజ్- నా సీనియర్ అన్న శివాత్మిక
Manchu Manoj Shivathmika Rajashekar Aasmaan Teaser Launch: రియల్ స్టార్ హీరో శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ఆస్మాన్. మేఘాంశ్ శ్రీహరి పుట్టినరోజున ఆస్మాన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌కి హీరో మంచు మనోజ్, హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ అతిథులుగా హాజరయ్యారు.
Manchu Manoj Shivathmika Rajashekar In Aasmaan Teaser Launch: టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న లేటెస్ట్ మూవీ ఆస్మాన్. శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆస్మాన్ టీజర్ లాంచ్
ఆస్మాన్ సినిమాకు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 16) నాడు ఆస్మాన్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ మేరకు నిర్వహించిన ఆస్మాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి రాకింగ్ స్టార్ మంచు మనోజ్, హీరోయన్ శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, శివాత్మిక రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
సినిమా ఉన్నంతకాలం శ్రీహరి ఉంటారు
రాకింగ్ మంచు మనోజ్ మాట్లాడుతూ.. "నా తమ్ముడు మేఘాంశ్ ‘ఆస్మాన్’ కోసం రావడం ఆనందంగా ఉంది. శ్రీహరి అంకుల్ మమ్మల్ని ఎత్తుకుని పెంచారు. నేను మేఘాంశ్‌ని ఎత్తుకున్నాను (నవ్వుతూ). సినిమా ఉన్నంత కాలం రియల్ స్టార్ శ్రీహరి గారు ఉంటారు" అని అన్నారు.
"మేఘాంశ్‌ని నేను ఎలా చూడాలని అనుకున్నానో ఆస్మాన్ టీజర్‌లో అలా కనిపించాడు. టీజర్ నాకు చాలా నచ్చింది. ప్రశాంత్ గారి బీజీఎమ్ అదిరిపోయింది. అరబిక్‌లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా తమ్ముడు మేఘాంశ్‌ను అందరూ ఆదరించి మంచి విజయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను" అని మంచు మనోజ్ కోరారు.
మేఘాంశ్ నా స్కూల్లో సీనియర్
శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, మేఘాంశ్ డైలాగ్స్ బాగున్నాయి. రాయంచ ముద్దుగా కనిపిస్తున్నారు. ప్రశాంత్ గారి మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. మేఘాంశ్ నా స్కూల్లో సీనియర్. ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు.
హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ కోసం వచ్చిన మనోజ్ అన్నకి, శివాత్మికకు థాంక్స్. ‘ఆస్మాన్’ మూవీని ఎంజాయ్ చేస్తూ చేశాను. షోయబ్ గారితో ఆల్రెడీ ఓ మూవీ చూస్తున్నాను. షోయబ్ గారి వల్లే ఈ చిత్రం ఈ స్థాయిలో వచ్చింది" అని అన్నారు.
రాయంచ అద్భుతంగా నటించారు
"హీరోయిన్ రాయంచ అద్భుతంగా నటించారు. రామ్ నందన్ ఈ సినిమాని గొప్ప స్థాయిలో తెరకెక్కించారు. ఈ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అది నా ప్రామీస్" అని దివంగత శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి చెప్పుకొచ్చారు.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ .. "‘ఆస్మాన్’ టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. చాలా వరకు రివీల్ చేశామనే చెప్పొచ్చు. మోషన్ పోస్టర్ నుంచి మొదలైన సస్పెన్స్‌ను టీజర్‌తో పెంచాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత వెంకటేష్, శ్రీకాంత్ గారికి థాంక్స్" అని అన్నారు.
ఏదో ఒక మిస్టరీ ఇస్తూనే ఉంటాం
"మా హీరో మేఘాంశ్‌కి టాలెంట్‌తో పాటు డెడికేషన్ ఉంది. షోయబ్ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ప్రశాంత్ గారి మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. రాయంచ అద్భుతంగా నటించారు. సినిమా రిలీజ్ వరకు ఏదో ఒక మిస్టరీ ఇస్తూనే ఉంటాం" అని డైరెక్టర్ రామ్ నందన్ పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


