Manchu Manoj Comments On Dasari Narayana Rao At Ghat: తెలుగు దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో, రాకింగ్ స్టార్ మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు.
మంచు మనోజ్ కామెంట్స్

ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై మనోజ్ రియాక్ట్ కావటమే కాకుండా స్వయంగా ఆ ప్రదేశాన్ని సందర్శించి, శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను చాటుకున్నారు మంచు మనోజ్. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఇంట్రెస్టంగ్ కామెంట్స్ చేశారు
మంచు మనోజ్ మాట్లాడుతూ.. "ఈరోజు మన గురువు గారు దాసరి నారాయణరావు గారి వర్ధంతి. నిజానికి ఈరోజు ఆయన వర్ధంతి అనే విషయం నాకు గుర్తు లేదు. నాలుగు రోజుల క్రితం చిత్రపురి కాలనీ వైపు వస్తుంటే, గురువు గారి విగ్రహం చూసి ఫ్యామిలీని గుర్తు చేసుకున్నాను. వెంటనే అరుణ్ అన్నకు ఫోన్ చేసి ఆలం అక్క నెంబర్ మారి పోయుంటే తీసుకున్నాను" అని తెలిపాడు.
వీడియో చూడగానే బాధేసింది
"వారితో మాట్లాడాను. ఎందుకనో దాసరి గారు గుర్తుకు వస్తున్నారని కూడా అన్నాను. ఈలోగా వేరే పనిలో పడి విషయం మరచిపోయాను. అది జరిగి నాలుగు రోజులు కూడా కాకముందే నిన్న సాయంత్రం గురువు గారు ఘాట్‌కు సంబంధించిన వీడియో చూడగానే చాలా బాధేసింది. వెంటనే స్పందించాను. నా టీమ్‌కు చెప్పాను. నేను ఆలస్యంగా చెప్పినా కూడా దార్లో వాళ్లు కార్మిక సిబ్బందిని మా కార్లలోనే ఎక్కించుకుని వచ్చాం. యాదగిరి అన్నకు ఫోన్ చేస్తే అన్న తెల్లవారు జామునే స్పందించారు" అని మనోజ్ పేర్కొన్నాడు.
"అలాగే ఎమ్మెల్యేగారు కూడా వెంటనే స్పందించారు. నేను కాల్ చేసిన ఇరవై నిమిషాల్లోనే స్పందించారు. జెసీబీని అరెంజ్ చేశారు. అన్నీ ఏర్పాట్లు చేశారు. 20-25 మంది పని చేశాం. నా మాట మీద ఇక్కడకు వచ్చిన వారందరికీ, వసతులను ఏర్పాటు చేసిన అందరికీ థాంక్స్" అని మంచు మనోజ్ చెప్పారు.
24 శాఖలపై రాణించారు
{{/usCountry}}"అలాగే ఎమ్మెల్యేగారు కూడా వెంటనే స్పందించారు. నేను కాల్ చేసిన ఇరవై నిమిషాల్లోనే స్పందించారు. జెసీబీని అరెంజ్ చేశారు. అన్నీ ఏర్పాట్లు చేశారు. 20-25 మంది పని చేశాం. నా మాట మీద ఇక్కడకు వచ్చిన వారందరికీ, వసతులను ఏర్పాటు చేసిన అందరికీ థాంక్స్" అని మంచు మనోజ్ చెప్పారు.
24 శాఖలపై రాణించారు
{{/usCountry}}"గురువుగారి గురించి చెప్పాలంటే గొప్ప డైరెక్టర్..గొప్ప యాక్టర్.. గొప్ప స్క్రీన్ ప్లే రైటర్.. డైలాగ్స్, ఎడిటింగ్.. ఇలా 24 శాఖలపై ఆయన రాణించారు. ఆయన నా తండ్రి సమానులు. మా గురువు గారు. ఆయన్ని, పద్మ అంటీని ఎప్పుడూ మిస్ అవుతుంటాను. వాళ్లు లేని లోటు మాకు..ముఖ్యంగా నాకు బాగా తెలుస్తోంది" అని ఎమోషనల్ అయ్యారు మంచు మనోజ్.
"దాసరి గారి గురించి చెప్పాలంటే ఆయన డైరెక్షన్‌లో రూపొందిన నా మొగుడు నాకే సొంతం సినిమాలోయాక్ట్ చేశాను. అలాగే పుణ్యభూమి నాదేశం సినిమాలో ఆయనతో కలిసి నటించే భాగ్యం దక్కింది. మ్యూజిక్, ఎడిటింగ్ వర్క్స్ జరిగేటప్పుడు ఆయనతో పాటు వెళ్లేవాడిని. నాకు కూడా సినీ క్రాఫ్ట్ మీద ఇంత పిచ్చి, ఆసక్తి, ప్రాణం ఉందంటే మా నాన్నగారితో పాటు గురువు గారికే ఆ క్రెడిట్ దక్కుతుంది" అని మంచు మనోజ్ వెల్లడించారు.
హీరోలకు భయం పుట్టించారు
"గురువు గారు ఓ ఇన్‌స్టిట్యూట్. ఆయన మనకు ఓ దారి చూపించారు. ముఖ్యంగా ఆయన తీసిన సినిమాలు. సామాజిక సినిమాలు, కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. దాసరి గారి పని అయిపోయిందని అనుకునే సమయంలో ఓ కొత్త రకమైన సినిమాతో మన ముందుకు వచ్చేవారు" అని మంచు మనోజ్ అన్నారు.
"కమర్షియల్, మేల్ డామినేషన్ ఉన్న సమయంలో విజయశాంతి గారితో ఒసేయ్ రాములమ్మ అనే సినిమా తీసి.. ప్రతీ హీరోకి భయం పుట్టించారు. ఆమెను కమర్షియల్ హీరో రేంజ్‌కు తీసుకొచ్చారు. ఆయన ఇచ్చిన సామాజిక సందేశాలు కానీ.. డ్రామా ఇలా ప్రతీ ఒక్కటి డిఫరెంట్" అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు.