...
...
Next Story

Manchu Manoj: లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై మంచు మనోజ్ ఆవేదన- శుభ్రం చేయించిన హీరో!

Manchu Manoj About Dasari Narayanarao Ghat Memorial: టాలీవుడ్ లెజెండర్ దర్శకనిర్మాత దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ స్పందించారు. దాసరి ఘాట్‌ను స్వయంగా సందర్శించిన మంచు మనోజ్ ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published on: May 30, 2026, 15:10:22 IST
Advertisement

Manchu Manoj About Dasari Narayanarao Ghat Memorial: దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో యాంకర్ గౌతమి ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే అక్కడి వాతావరణం, ఆ ఘాట్ స్థితి ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో వచ్చిన కొన్ని గంటల్లో ‘రా కింగ్’ స్టార్ మంచి మనోజ్ స్పందించారు.

దాసరి నారాయణరావు ఘాట్‌ను సందర్శించి

లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై మంచు మనోజ్ ఆవేదన- శుభ్రం చేయించిన హీరో!
లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు ఘాట్ దుస్థితిపై మంచు మనోజ్ ఆవేదన- శుభ్రం చేయించిన హీరో!

అంతేకాకుండా మంచు మనోజ్ స్వయంగా దాసరి నారాయణరావు ఘాట్‌ను సందర్శించి, ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచే కార్యక్రమాలను ప్రారంభించారు. దాసరి పట్ల తనకున్న గౌరవాన్ని మంచు మనోజ్ ఇలా చాటుకున్నారు.

నిజంగా చాలా బాధ కలిగింది

దాసరి నారాయణరావు ఘాట్ పరిస్థితిపై సోషల్ మీడియాలో మనోజ్ మంచు స్పందిస్తూ.. ‘‘దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. దాసరి నారాయణరావు గారు తరతరాలకు స్ఫూర్తినిచ్చి, తెలుగు సినిమాకు ఎంతో దోహదపడ్డారు. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. నా వంతుగా నేను చేయగలిగి సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాను’ అని ట్వీట్ వేశారు.

నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చాను

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మంచు మనోజ్ తన సినిమా షూటింగ్‌కి వెళ్లే కంటే ముందు ఉదయం 7:00 గంటల కల్లా తన బృంద సభ్యులతో కలిసి దాసరి ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. "మూడు, నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడకు వచ్చాను. ప్రస్తుతం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్ని చూసి చాలా బాధపడ్డాను" అని అన్నారు.

ఆ దృశ్యాలు చూసి తట్టుకోలేకపోయాను

ఆ తర్వాత మనోజ్ తన టీంతో కలిసి ఘాట్ చుట్టూ పేరుకుపోయిన ఎండుటాకులు, చెత్తను తొలగిస్తూ ఘాట్ ప్రాంతమంతటినీ శుభ్రం చేశారు. మనోజ్, మౌనిక ఇటీవల ప్రారంభించిన 'ఐక్య ధైర్య సేనా సమితి' అనే సామాజిక సేవా ఉద్యమం వెనుక ఉన్న ఉన్నత స్ఫూర్తిని ఈ చర్య ప్రతిబింబిస్తుంది.

వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా

ఇదిలా ఉంటే, ఈ మధ్య మంచు మనోజ్ రక్తదాన శిబిరాలు, సహాయ కార్యక్రమాలు, మాతృదేవోభవ అనాథాశ్రమాన్ని సందర్శించడం అందరికీ తెలిసిందే. ఐక్య ధైర్య సేన సమితి ద్వారా వాయిస్ లెస్‌కి వాయిస్‌గా నిలుస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు మనోజ్ మంచు. ఇప్పుడు మనోజ్ దాసరి నారాయణరావు గారి ఘాట్‌ని సందర్శించడం ఆయన నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe