...
...
Next Story

Nayanthara MP Row: నయనతార కావాలన్న ఎంపీ- భగ్గుమన్న మంచు విష్ణు, ఖుష్బూ- దారినపోయే ప్రతివాడు లాగడం, నీ ఆస్తి కాదంటూ!

Manchu Vishnu Kushboo Sundar Slams MP Shanmugam: హీరోయిన్ నయనతారపై ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ భగ్గుమంది. మహిళా నటీమణులు ఎవరికీ సొత్తు కాదని, వారిని చౌకబారు జోకులకు వాడుకోవద్దని ఖుష్బూ సుందర్ హెచ్చరించారు. హీరోయిన్స్ ఏమి పంచ్ బ్యాగ్‌లు కాదంటూ మంచు విష్ణు కౌంటర్ ఇచ్చారు.

Published on: Mar 18, 2026, 15:09:37 IST
Advertisement

రాజకీయ విమర్శల్లో స్థాయిని మరచి ప్రవర్తించడం ఇటీవల కాలంలో ఎక్కువైపోతోంది. తాజాగా తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం, హీరోయిన్ నయనతారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

నయనతార కావాలన్న ఎంపీ- భగ్గుమన్న మంచు విష్ణు, ఖుష్బూ- దారినపోయే ప్రతివాడు లాగడం, నీ ఆస్తి కాదంటూ!
నయనతార కావాలన్న ఎంపీ- భగ్గుమన్న మంచు విష్ణు, ఖుష్బూ- దారినపోయే ప్రతివాడు లాగడం, నీ ఆస్తి కాదంటూ!

నాకు నయనతార కావాలి

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రవేశపెట్టిన 'నీ కనవు ననవాగ' (మీ కల మాకు చెప్పండి) అనే పథకాన్ని ఎద్దేవా చేసే క్రమంలో.. "నాకు నయనతార కావాలని కల వస్తే, ముఖ్యమంత్రి నెరవేరుస్తారా?" అంటూ ఎంపీ సీవీ షణ్ముగం కామెంట్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవ్వగా, సినీ ప్రముఖులు మంచు విష్ణు, ఖుష్బూ సుందర్ తాజాగా గట్టిగా బదులిచ్చారు.

దారినపోయే ప్రతివాడు

ఈ వ్యవహారంపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా నిప్పులు చెరిగారు. "మహిళలు, ముఖ్యంగా నటీమణులు ఎవరికీ సొంత ఆస్తి కాదు. దారినపోయే ప్రతివాడు తమ సంభాషణల్లోకి లాగడానికి వారేమీ (నటీమణులు) వస్తువులు కాదు. ఒక నటి పేరును మీ చౌకబారు జోకులకు, అవమానాలకు వాడుకోవడం మీ నీచమైన మనస్తత్వాన్ని, పెరిగిన పద్ధతిని బయటపెడుతోంది" అని ఖుష్బూ సుందర్ మండిపడ్డారు.

నీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడతావా?

"ప్రతి మగాడు ఒక మహిళకు జన్మించినవాడే. ఒక నటి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు.. నీ తల్లి, సోదరి లేదా భార్య గురించి ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటావా? అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నటీమణులు ప్రజల మధ్య ఉండవచ్చు కానీ వారు ఎవరికీ వ్యక్తిగత ఆస్తి కాదు. వారి వృత్తి ఏదైనా సరే గౌరవం ఇవ్వడం నేర్చుకోండి" అని ఖుష్బూ హితవు పలికారు.

నటీమణులు రాజకీయ పంచ్ బ్యాగులు కాదు

మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. "తమిళనాడు రాజకీయ ప్రచారాల గురించి చదువుతుంటే బాధేస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసం నటీమణులను ఇలాంటి చర్చల్లోకి లాగడం చాలా తక్కువ స్థాయి చర్య" అని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు.

హెడ్ లైన్స్ కోసం వాడుకోవడం మానుకోండి

చివరకు ఎంపీ విచారం..

విల్లుపురం నిరసన కార్యక్రమాల్లో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఎంపీ షణ్ముగం వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు 'పొరపాటున' వచ్చినవని, ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని చెబుతూ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఏఐఏడీఎంకే పార్టీ మాత్రం ఇది ఆయన వ్యక్తిగత వ్యాఖ్యేనని, పార్టీకి దీనితో సంబంధం లేదని స్పష్టం చేసింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe