Suhas Suri Mandaadi Teaser Released: తెలుగులో తనదైన స్టైల్‌లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు హీరో సుహాస్. హీరోగానే కాకుండా విలన్‌గా, నటుడిగా కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నాడు. అలాంటి సుహాస్ నటించిన లేటెస్ట్ తమిళ సినిమానే మండాడి. ఈ సినిమాలో సుహాస్‌తోపాటు హీరోగా మారిన కోలీవుడ్ కమెడియన్ సూరి మరో కీ రోల్ పోషిస్తున్నాడు.
సుహాస్, సూరి మెయిన్ లీడ్ రోల్స్‌లో

సుహాస్, సూరి మెయిన్ లీడ్ రోల్స్‌లో నటించిన మండాడి సినిమాను స్పోర్ట్స్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాను ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద ఎల్రెడ్ కుమార్ నిర్మాతగా రూపొందించారు. ఈ మండాడి సినిమాకు మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించారు.
మండాడి నటీనటులు, విడుదల తేది
అలాగే, మండాడి సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. మండాడి మూవీని సెప్టెంబర్ 10న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
మండాడి తెలుగు టీజర్ రిలీజ్
ఏపీ, తెలంగాణలో మండాడి చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఈ క్రమంలో తాజాగా మండాడి తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. మండాడి టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటోంది.
అదిరిపోయిన డైలాగ్స్
మండాడి టీజర్‌లోకి వెళితే.. ‘పందెమే మనల్ని కాపాడుతుంది.. పందెన్నీ మనం కాపాడటం లేదు’, ‘బరిలోకి దిగే ప్లేయర్స్‌లో నిజాయితీ ఉంటే.. ఈ గాలి, సముద్రం మిమ్మల్ని ఎప్పటికీ ఒగ్గేయదు’ అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
హైలెట్‌గా విజువల్స్, బోట్ సీక్వెన్స్
అలాగే, మండాడి టీజర్‌లో చూపించిన విజువల్స్, బోట్ సీక్వెన్స్, పడవ పందెంలకు సంబంధించిన సీన్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సుహాస్, సూరి పవర్ ఫుల్ ఎంట్రీలు, జీవీ ప్రకాష్ ఇచ్చిన బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఒక్కసారిగా పెరిగిన అంచనాలు
{{/usCountry}}అలాగే, మండాడి టీజర్‌లో చూపించిన విజువల్స్, బోట్ సీక్వెన్స్, పడవ పందెంలకు సంబంధించిన సీన్లు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ఇక సుహాస్, సూరి పవర్ ఫుల్ ఎంట్రీలు, జీవీ ప్రకాష్ ఇచ్చిన బీజీఎమ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
ఒక్కసారిగా పెరిగిన అంచనాలు
{{/usCountry}}మండాడి టీజర్‌తో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయ్యాయి. డైలాగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్ ఇలా అన్ని రకాలుగా ‘మండాడి’ ఇంటెన్స్‌గా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఈ సినిమాకి సంగీతాన్ని జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు.
యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్
మండాడి సినిమాకు ప్రొడక్షన్ డిజైన్‌ను డి.ఆర్.కె. కిరణ్, ఎడిటింగ్‌ను ప్రదీప్ ఇ. రాఘవ్, యాక్షన్ సన్నివేశాలకు పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేశారు.
5 భాషల్లో మండాడి గ్రాండ్ రిలీజ్
మండాడి సినిమాను తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో సెప్టెంబర్ 10న చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.