OTT Crime Thriller: ఓటీటీలోకి ఈ వారం ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. 93 మంది ఆడపిల్లల కిడ్నాప్..
OTT Crime Thriller: ఓటీటీలోకి ఈ వారం ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమా పేరు మర్దానీ 3 (Mardaani 3). రాణీ ముఖర్జీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో డిజిటల్ ప్రీమియర్ కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ 'మర్దానీ 3' ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది జనవరి 30న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. సరిగ్గా ఎనిమిది వారాల తర్వాత మార్చి 27న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కాబోతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూడో భాగానికి అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించాడు. ఇండియన్ సినిమాలో తిరుగులేని యాక్షన్ హీరోయిన్‌గా రాణీ ముఖర్జీకి ఉన్న క్రేజ్‌ను ఈ సినిమా మరోసారి నిరూపించింది.

మర్దానీ 3 ఓటీటీ వివరాలు
ఈ ఏడాది మొదట్లో బాక్సాఫీస్ దగ్గర 'బోర్డర్ 2' లాంటి భారీ సినిమాతో పోటీ పడినప్పటికీ.. మర్దానీ 3 తన సత్తా చాటుకుంది. 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.75 కోట్ల గ్రాస్, అలాగే ఇండియాలో రూ.60 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి చివర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వేరే సినిమాల పోటీ లేకపోవడాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవడానికి జనవరి 30కే ముందుకు తీసుకొచ్చారు. మర్దానీ గత సినిమాలకు దర్శకత్వం వహించిన గోపి పుత్రన్ స్థానంలో ఈసారి అభిరాజ్ మినావాలా దర్శకుడిగా మారాడు. నిర్మాత ఆదిత్య చోప్రా తీసుకున్న ఈ నిర్ణయం బాగా వర్కౌట్ అయింది. కథలోని సీరియస్‌నెస్, రాణీ ముఖర్జీ నటన జనాలకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఫిబ్రవరి నెలంతా థియేటర్ల దగ్గర మంచి కలెక్షన్లు వచ్చాయి.
ఆడిపిల్లల కిడ్నాప్ మిస్టరీ
సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) శివాని శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ).. ఎనిమిది నుంచి పదేళ్ల వయసున్న 93 మంది చిన్నపిల్లల కిడ్నాప్ కేసును దర్యాప్తు చేయడం ఈ కథలో ప్రధాన అంశం.
ఈ దర్యాప్తులో ఆమెకు ఒక భయంకరమైన బిచ్చగాళ్ల మాఫియా, అలాగే ఒక ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్‌పెరిమెంట్ గుట్టు తెలుస్తుంది. హెచ్‌పీవీ వైరస్‌ను మార్చి ఆ కిడ్నాప్ అయిన పిల్లల మీద చట్టవిరుద్ధంగా మందులు ప్రయోగిస్తున్నారన్న విషయం బయటపడుతుంది. ఈ దర్యాప్తు ఇండియా దాటి శ్రీలంకలోని కొలంబో వరకు వెళ్లడంతో, అక్కడ జరిగే ఛేజింగ్ సీన్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి.
మర్దానీ 3 విశేషాలు
ఈ మర్దానీ సిరీస్‌లో తొలిసారిగా ఒక లేడీ విలన్‌ను పరిచయం చేశారు. "అమ్మ" అనే పాత్రలో మల్లికా ప్రసాద్ అద్భుతంగా నటించింది. పిల్లలను అక్రమంగా రవాణా చేస్తూ, ఈ మెడికల్ మాఫియాను నడిపించే క్రిమినల్ పాత్ర ఆమెది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రాణీ ముఖర్జీకి ధీటుగా, చాలా కూల్‌గా క్రూరమైన పనులు చేసే విలన్‌గా మల్లికా ప్రసాద్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అలాగే కానిస్టేబుల్ ఫాతిమా అన్వర్ పాత్రలో జానకి బోడివాలా ఒక ముఖ్యమైన ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది. డాక్టర్ బిక్రమ్ రాయ్‌గా (శివాని భర్త పాత్రలో) జిష్షు సేన్‌గుప్తా మళ్లీ కనిపించగా, ఇంద్రనీల్ భట్టాచార్య, మిఖాయిల్ యావల్కర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు, నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఈ సినిమాను మన ముందుకు తీసుకొస్తోంది. థియేటర్లో మిస్ అయిన వాళ్లతో పాటు, మళ్లీ ఆ యాక్షన్ సీన్స్ చూడాలనుకునే వాళ్లు ఈ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం ఒరిజినల్ హిందీతో పాటు వివిధ భాషల్లో డబ్బింగ్, సబ్‌టైటిల్స్‌తో నెట్‌ఫ్లిక్స్ దీన్ని అందుబాటులోకి తేనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


