రీసెంట్ గా తెలుగులో వచ్చిన సినిమాల్లో భారీ డిజాస్టర్ గా నిలిచిన సినిమాల్లో ‘మాస్ జాతర’ ఒకటి. రవితేజ హీరోగా వచ్చిన ఈ కాప్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో దారుణమైన ప్రదర్శన చేసింది. రొటీన్ స్టోరీతో ఆడియన్స్ ను తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది. కలెక్షన్లలో చెత్త రికార్డునూ ఖాతాలో వేసుకుంది. ఇవాళ (నవంబర్ 28) ఈ మూవీ ఓటీటీలో రిలీజైంది.
మాస్ జాతర ఓటీటీ

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ మాస్ జాతర మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (నవంబర్ 28) నుంచి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను చూడొచ్చు.
75వ సినిమా
మాస్ జాతర ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఓ సారి ఈ మూవీ విశేషాలపై ఓ లుక్కేద్దాం. రవితేజ కెరీర్ లో ఇది 75వ సినిమా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి, ఏ సపోర్ట్ లేకుండా హీరోగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు కెరీర్. ఆయన కెరీర్ లో మాస్ జాతరకు స్పెషల్ ప్లేస్ ఉంది. ఇది ఆయనకు 75వ సినిమాగా నిలిచిపోయింది.
రవితేజ, శ్రీలీల
రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో ఇది రెండో మూవీ. 2022లో వచ్చిన ధమాకా సినిమా కోసం వీళ్లు ఫస్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో మాస్ జాతర కోసం మళ్లీ జతకట్టారు. కానీ మాస్ జాతర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.
డెబ్యూ డైరెక్టర్
మాస్ జాతర మూవీకి డైరెక్టర్ భాను భోగవరపు. అతనికి దర్శకుడిగా ఇదే ఫస్ట్ మూవీ. కథ కూడా భానుదే. మాస్ జాతర మూవీతో రవితేజ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలనుకున్న భానుకు రిజల్ట్ మాత్రం నెగెటివ్ గా వచ్చింది. ఈ మూవీకి ఫస్ట్ నుంచే నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.
కలెక్షన్ల రికార్డు
{{/usCountry}}మాస్ జాతర మూవీకి డైరెక్టర్ భాను భోగవరపు. అతనికి దర్శకుడిగా ఇదే ఫస్ట్ మూవీ. కథ కూడా భానుదే. మాస్ జాతర మూవీతో రవితేజ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వాలనుకున్న భానుకు రిజల్ట్ మాత్రం నెగెటివ్ గా వచ్చింది. ఈ మూవీకి ఫస్ట్ నుంచే నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.
కలెక్షన్ల రికార్డు
{{/usCountry}}కలెక్షన్ల పరంగా మాస్ జాతర చెత్త రికార్డు సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ మూవీ దారుణమైన రిజల్ట్ అందుకుంది. రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ డే ఇండియాలో కనీసం ఒక కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. చివరికి ప్రపంచవ్యాప్తంగా రూ.20 కోట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. ఇది అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది.