Mayookha: సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్- పెద్ద బడ్జెట్ ఇస్తే మిరాకిల్స్ చేస్తారన్న ఆ నిర్మాత

Mayookha 25 Days Success Celebrations: పాయల్ చెంగప్ప నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మయూఖ బాక్సాఫీస్ వద్ద 25 రోజులు పూర్తి చేసుకుని ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ వేడుకల్లో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని సక్సెస్ షీల్డ్‌లను అందజేశారు.

Published on: Nov 3, 2026, 20:52:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Mayookha 25 Days Success Celebrations: బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా "మయూఖ" (Mayookha Movie). ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. శ్రీ తేజ్ ఎస్‌కె దర్శకత్వం వహించారు.

సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్- పెద్ద బడ్జెట్ ఇస్తే మిరాకిల్స్ చేస్తారన్న ఆ నిర్మాత
సస్పెన్స్ థ్రిల్లర్ మయూఖ 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్- పెద్ద బడ్జెట్ ఇస్తే మిరాకిల్స్ చేస్తారన్న ఆ నిర్మాత

మయూఖ 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్

ఇటీవలే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన "మయూఖ" సినిమా ట్రెండ్ సెట్టింగ్ థ్రిల్లర్‌గా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 25 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ తాజాగా ఈ రోజు (నవంబర్ 3) హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలువురు మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని "మయూఖ" సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

పెద్ద బడ్జెట్ ఇస్తే మిరాకిల్స్ చేస్తారు

ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డి.గిరీష్ రెడ్డి మాట్లాడుతూ.. "మా సినిమాకు ఉన్న బడ్జెట్‌లో ఇంత క్వాలిటీగా సినిమా చేసి, గ్రాండ్‌గా రిలీజ్ చేసుకున్నాం అంటే అందుకు మా డైరెక్టర్ విజన్ కారణం. ఆయనకు పెద్ద బడ్జెట్ ఇచ్చి సినిమా చేయమంటే మిరాకిల్స్ చేస్తారు. మా సినిమాను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్" అని అన్నారు.

యాక్టర్ రఘు వాసిరెడ్డి మాట్లాడుతూ.. "మా సినిమా సక్సెస్ షీల్డ్ అందుకోవడం నా కెరీర్‌లో ఎంతో స్పెషల్ మూవ్‌మెంట్‌గా భావిస్తున్నా. ఈ షీల్డ్ నేను అందుకున్నానంటే కారణం మా డైరెక్టర్ శ్రీతేజ్. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని చెప్పారు.

వారం రోజులు ఆడితేనే గొప్ప విషయం

యాక్టర్ అభిలాష్ అడ్డ మాట్లాడుతూ.. "ఈ రోజున సినిమాలు ఒక వారం రోజులు ఆదరణ పొందితేనే గొప్ప విషయం. అలాంటిది మా సినిమాకు పాతిక రోజుల రన్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. చిన్న సినిమాల విషయంలో బాక్సాఫీస్ వద్ద ఇది అరుదుగా దక్కే విజయం. ఈ సినిమా సక్సెస్ మా డైరెక్టర్ విజన్, కన్విక్షన్‌ను చూపిస్తోంది" అని పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ.. "ఒక సినిమా రిలీజై నెక్ట్స్ ఫ్రైడే చూడటం అనేది అరుదు. అలాంటిది 25 రోజులు థియేటర్స్‌లో సినిమా రన్ కావడం అంటే ఈజీ కాదు. అలాంటి ఘనత సాధించిన "మయూఖ" టీమ్‌ను అభినందిస్తున్నా. ఈ రోజు చిన్న చిత్రాలు థియేటర్స్‌లో ఆడటం ఎంత కష్టమైందో మనం చూస్తున్నాం. ఈ టీమ్ ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించారు.

మైండ్ బెండింగ్ బ్లాక్ బస్టర్‌కు మించి పెట్టినా

"మయూఖ సినిమా ప్రీమియర్స్ వేశారు. అప్పుడు సినిమా చూసి ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పాను. మేము ఆశించినట్లే మయూఖ సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్" అని వీ5 ఎండీ వెంకటేష్ చెప్పారు.

"మా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కు మైండ్ బెండింగ్ బ్లాక్ బస్టర్ అని పేరు పెట్టారు. ఇంతకంటే పెద్ద పేరు పెట్టినా మాకు సంతోషమే. కొత్త టీమ్‌తో ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ నిర్మించిన మా ప్రొడ్యూసర్ గారికి, సినిమాను రూపొందించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్" అని యాక్టర్ దేవ్ డి అన్నారు.

సక్సెస్ షీల్డ్స్ బహుకరణ

అలాగే, ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌సో పొలిటికల్ లీడర్ చిన్న శ్రీశైలం యాదవ్, వీ5 ఎండీ వెంకటేష్, ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ కూండ్ల మయూఖ మూవీ టీమ్‌కు సక్సెస్ షీల్డ్‌లు అందించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More