తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది మీనాక్షి చౌదరి. నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన అప్ కమింగ్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రం సంక్రాంతి 2026 స్పెషల్ గా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ప్రేమ, పెళ్లిపై మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. లవ్ మ్యారేజీ చేసుకుంటానంది. మరోవైపు ఓ అక్కినేని హీరోతో ఆమె ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
పెళ్లిపై మీనాక్షి చౌదరి

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ భామ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లిపై మాట్లాడింది. ‘‘నేను పెళ్లిచేసుకోబోతున్న అనే రూమర్లు విన్నప్పుడు నవ్వొస్తుంది. నో రా, నేనే చెప్తా. నేను అనౌన్స్ చేస్తా. దానికి ఇంకా టైమ్ ఉంది’’ అని మీనాక్షి చౌదరి చెప్పింది.
లవ్ మ్యారేజీ
పెళ్లికి ఇంకా టైమ్ ఉందని కానీ లవ్ మ్యారేజీ చేసుకుంటానని మీనాక్షి చౌదరి తెలిపింది. ‘‘ఇప్పుడైతే పెళ్లి చేసుకోను. తర్వాత ఏ మ్యారేజీ అయినా ఓకే. కానీ ఒకటే చెప్పాలంటే మంచి డిసిషన్. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ పేరేంట్స్, బ్రదర్స్ గా ఎవరు ఉండాలనేది మీ చేతుల్లో లేదు. కానీ లైఫ్ పార్ట్ నర్ ఎవరు ఉండాలనేది మీ చేతుల్లో ఉంది. లవ్ మ్యారేజీ చేసుకుంటా’’ అని మీనాక్షి చౌదరి పేర్కొంది.
అక్కినేని హీరోతో
ఓ వైపు అక్కినేని హీరో సుశాంత్ తో మీనాక్షి చౌదరి లవ్ రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి 2021లో వచ్చిన ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. 2024లో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. కానీ మీనాక్షి ఈ రూమర్లను గతంలో ఖండించింది.
అనగనగా ఒక రాజు
{{/usCountry}}ఓ వైపు అక్కినేని హీరో సుశాంత్ తో మీనాక్షి చౌదరి లవ్ రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీళ్లిద్దరు కలిసి 2021లో వచ్చిన ‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీళ్లు ప్రేమలో ఉన్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. 2024లో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ కూడా వచ్చింది. కానీ మీనాక్షి ఈ రూమర్లను గతంలో ఖండించింది.
అనగనగా ఒక రాజు
{{/usCountry}}నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన మూవీ ‘అనగనగా ఒక రాజు’. ఈ ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జనవరి 14న రిలీజ్ కానుంది. 2026 సంక్రాంతి రేసులో రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ లాంటి పెద్ద సినిమాలతో అనగనగా ఒక రాజు పోటీపడుతుంది.