...
...
Next Story

Meenakshi Sheshadri: 62 ఏళ్ల వయసులో నటి హాట్ డ్యాన్సులు.. నీకు అవసరమా అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఆమె రియాక్షన్ ఇలా

Meenakshi Sheshadri: బాలీవుడ్ సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి 'షహెన్షా' చిత్రంలోని ఐకానిక్ సాంగ్ 'హే యూ'ను రీక్రియేట్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. వయసుపై ట్రోల్స్ చేసిన వారికి అభిమానుల మద్దతుతో ఆమె అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

Published on: Mar 31, 2026, 21:51:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Meenakshi Sheshadri: బాలీవుడ్ తోపాటు తెలుగులోనూ ఒకప్పుడు వెలుగు వెలిగిన అందాల తార మీనాక్షి శేషాద్రి మరోసారి వార్తల్లో నిలిచింది. 1988లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'షెహెన్షా'లోని తన సూపర్ హిట్ సాంగ్ 'హే యూ'ను 62 ఏళ్ల వయసులో ఆమె రీక్రియేట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా, అది కాస్తా వైరల్‌గా మారింది. 80వ దశకంలో తన నటనతో, డ్యాన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన మీనాక్షి.. నేటికీ అదే గ్రేస్, అదే ఎనర్జీని ప్రదర్శిస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ వీడియోపై కొందరు నెటిజన్లు వయసును ఉద్దేశించి చేసిన కామెంట్లకు ఆమె అభిమానులు గట్టిగా సమాధానమిచ్చింది.

వర్షంలో 'హే యూ' మ్యాజిక్

Meenakshi Sheshadri: 62 ఏళ్ల వయసులో నటి హాట్ డ్యాన్సులు.. నీకు అవసరమా అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఆమె రియాక్షన్ ఇలా
Meenakshi Sheshadri: 62 ఏళ్ల వయసులో నటి హాట్ డ్యాన్సులు.. నీకు అవసరమా అంటూ ఫ్యాన్స్ ట్రోలింగ్.. ఆమె రియాక్షన్ ఇలా

ఒకప్పుడు అమితాబ్ బచ్చన్, అమ్రిష్ పురి కాంబినేషన్‌లో వచ్చిన 'షెహెన్షా' మూవీ బాలీవుడ్‌లో ఒక కల్ట్ క్లాసిక్. ఈ సినిమా అమితాబ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. తాజాగా విడుదల చేసిన రీల్‌లో మీనాక్షి రెడ్ కలర్ ఆఫ్-షోల్డర్ కోర్సెట్ డ్రెస్ ధరించి మెరిసింది.

పుణేలో కురిసిన భారీ వర్షం తర్వాత ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆమె చేసిన డ్యాన్స్ రీల్ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చింది. ఆమె ముఖంలోని హావభావాలు, ఆ చిరునవ్వు 80ల నాటి మీనాక్షిని కళ్లముందుకు తీసుకొచ్చాయి.

నా ఫేవరెట్ హీరోతో చేశా..

తన కెరీర్ గురించి స్పందిస్తూ మీనాక్షి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "హే యూ.. నా కెరీర్‌లో నేను చేసిన అతి తక్కువ ఐటమ్ సాంగ్స్‌లో ఇది ఒకటి. నా ఫేవరెట్ హీరో అమితాబ్ బచ్చన్‌తో నేను కలిసి నటించిన మొదటి చిత్రం షెహెన్షా. ఈ పాటలో అన్ని రకాల మాస్ మసాలా అంశాలు ఉంటాయి. లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే పాడిన అద్భుతమైన పాట ఇది. అప్పట్లో కమల్ మాస్టర్ కొరియోగ్రఫీలో అద్భుతమైన సెట్స్, కాస్ట్యూమ్స్‌తో ఈ పాటను చిత్రీకరించారు" అని ఆమె తన గతాన్ని నెమరువేసుకుంది.

మీనాక్షి ఎనర్జీని చూసి చాలామంది ప్రశంసలు కురిపిస్తుంటే, కొందరు మాత్రం వయసును సాకుగా చూపుతూ విమర్శలకు దిగారు. "మేడం, మీకు ఇప్పుడు వయసు అయిపోయింది. ఇలాంటి డ్యాన్సులు మానేసి చార్ ధామ్ యాత్రకు వెళ్లండి" అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. "ముసలి వయసులో ఇలాంటి పనులు చేసి పరువు పోగొట్టుకోవడం ఎందుకు? మీ టైమ్ అయిపోయిందని ఎవరైనా వీరికి చెప్పండి" అంటూ మరికొందరు అసహనం వ్యక్తం చేశారు.

అయితే మీనాక్షి శేషాద్రి ఈ నెగెటివిటీని ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతికూల వ్యాఖ్యలను విస్మరిస్తూ.. తనను ప్రోత్సహించిన వారికి మాత్రమే రిప్లై ఇస్తూ తన హుందాతనాన్ని చాటుకుంది. "వయసు అనేది కేవలం అంకె మాత్రమే.. మీ మూమెంట్స్ ఇప్పటికీ అద్భుతంగా ఉన్నాయి" అని ఒక అభిమాని కామెంట్ చేయగా.. "ఒక్కసారి స్టార్ అయితే ఎప్పటికీ స్టార్‌గానే ఉంటారు" అని మరొకరు మద్దతుగా నిలిచారు. అభిమానుల ప్రేమకు ప్రతిస్పందనగా మీనాక్షి స్మైలీలు, నమస్కారం ఎమోజీలను షేర్ చేసింది.

మీనాక్షి శేషాద్రి కెరీర్

1980, 90వ దశకాల్లో మీనాక్షి శేషాద్రి అగ్ర కథానాయికగా రాణించింది. 'హీరో', 'దామిని', 'ఘాతక్' వంటి చిత్రాలు ఆమెకు ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగులోనూ చిరంజీవితో కలిసి ఆపద్బాందవుడులాంటి సినిమా చేసింది.

'ఘాతక్' తర్వాత ఆమె సినిమాలకు స్వస్తి చెప్పి అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఒక డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తూ, కళ పట్ల తనకున్న మక్కువను కొనసాగిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన పాత సినిమాల ముచ్చట్లను, డ్యాన్స్ వీడియోలను పంచుకుంటూ అభిమానులకు చేరువగా ఉంటోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

1. మీనాక్షి శేషాద్రి ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు?

సినిమాలకు దూరం అయిన తర్వాత మీనాక్షి శేషాద్రి అమెరికాకు మకాం మార్చారు. ప్రస్తుతం ఆమె అక్కడ ఒక డ్యాన్స్ అకాడమీని నడుపుతున్నారు.

2. షహెన్షా సినిమా ప్రాధాన్యత ఏమిటి?

ఇది 1988లో విడుదలైన భారీ విజయం సాధించిన చిత్రం. అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో అత్యంత ప్రభావవంతమైన డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాలో ఉన్నాయి.

3. మీనాక్షి చేసిన 'హే యూ' వీడియోపై వచ్చిన విమర్శలేంటి?

కొందరు నెటిజన్లు ఆమె వయసు గురించి విమర్శిస్తూ ('Ageist remarks'), ఇలాంటి డ్యాన్స్ వీడియోలు చేయవద్దని కామెంట్ చేశారు. కానీ మెజారిటీ నెటిజన్లు ఆమెకు అండగా నిలిచారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe