...
...
Next Story

Nagababu Prakash Raj: మిస్టర్ ప్రకాష్ రాజ్.. కోట్లాది ప్రజల నమ్మకాన్ని గౌరవించాలి.. రాముడిపై వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్

Nagababu Prakash Raj: మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబుకు కోపమొచ్చింది. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రకాష్ రాజ్ కు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కోట్లాది ప్రజల నమ్మకాన్ని గౌరవించాలని హితవు పలికాడు.

Published on: Apr 18, 2026, 14:10:27 IST
Advertisement

Nagababu Prakash Raj: శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ కామెంట్లు చేసినందుకు ప్రకాష్ రాజ్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల పోలీసులకు ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదులు కూడా చేశారు. తాజాగా ప్రకాష్ రాజ్ కామెంట్లపై మెగా బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబు ఫైర్ అయ్యాడు.

మిస్టర్ ప్రకాష్ రాజ్

ప్రకాష్ రాజ్ పై నాగబాబు ఫైర్ (x)
ప్రకాష్ రాజ్ పై నాగబాబు ఫైర్ (x)

శ్రీ రాముడి గురించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు మండిపడ్డాడు. మిస్టర్ ప్రకాష్ రాజ్ అంటూ ఎక్స్ వేదికగా నాగబాబు ఫైర్ అయ్యాడు.

‘‘మిస్టర్ ప్రకాష్ రాజ్, మిమ్మల్ని మీరు 'క్రిస్టియన్ నాస్తికుడిని' అని చెప్పుకున్నప్పటికీ, మీ తల్లిగారి అంత్యక్రియల సమయంలో ఆమె విశ్వాసాలను గౌరవించారు. ఒక కుమారుడిగా మీరు చేసిన ఆ పనిని మేమూ గౌరవిస్తాము. అదే స్ఫూర్తితో, మీరు కోట్ల మంది ప్రజల నమ్మకాలను కూడా గౌరవించాలి’’ అని నాగబాబు ఎక్స్ లో రాసుకొచ్చాడు.

ఎగతాళి చేయడం కాదు

‘‘నాస్తికత్వం అంటే దేవుళ్లనో లేదా భక్తులనో ఎగతాళి చేయడం కాదు, అది ఒక హేతుబద్ధమైన ఆలోచనా విధానం. నాస్తిక వాదాన్ని కూడా తనలో కలుపుకొని, దానికి తగిన స్థానాన్ని కల్పించిన ఏకైక ధర్మం హిందూ ధర్మం మాత్రమే. అటువంటి గొప్ప సంప్రదాయాన్ని కించపరచడం సరికాదు. అది అగౌరవపరచడమే అవుతుంది’’ అని నాగబాబు శనివారం (ఏప్రిల్ 18) ఎక్స్ లో పోస్టు చేశాడు.

వేరే దేశాల్లో

‘‘వేరే దేశాల్లో గనుక మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే, ఇప్పటికే తీవ్రమైన ఇబ్బందుల్లో పడేవారు. ఇది మీ గురించి నా డైరెక్ట్ కామెంట్. భవిష్యత్తులో గౌరవప్రదంగా ప్రవర్తించని మీలాంటి వ్యక్తుల మాటలకు నేను ఎప్పుడూ స్పందించను. విభిన్న విశ్వాసాలను గౌరవించడమే నిజమైన హేతుబద్ధతకు, బాధ్యతకు నిదర్శనం’’ అని ప్రకాష్ రాజ్ ను ట్యాగ్ చేస్తూ నాగబాబు ఆ పోస్ట్ ముగించాడు.

ప్రకాష్ రాజ్ ఏమన్నాడంటే?

ప్రకాష్ రాజ్ కామెంట్లు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రకాష్ రాజ్ ను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe