Varun Tej: మెగా ఫ్యామిలీ యువ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు సర్జరీ జరిగింది. అతను ప్రమాదానికి గురయ్యాడు. తన తదుపరి చిత్రం 'బరి' కోసం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన మోకాలికి తీవ్రమైన గాయమైంది. వాలీబాల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం వరుణ్ గత కొంతకాలంగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన మోకాలి ఎముక విరగడంతో తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
వరుణ్ తేజ్ కు సర్జరీ

వరుణ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అతని చెల్లి నిహారిక కొణిదెల అప్ డేట్ రిలీజ్ చేసింది. "బరి సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నా బ్రదర్ వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర గాయమైంది. వైద్యుల అతనికి విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం వరుణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. ఈ సమయంలో మీరు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు" అని నిహారిక పేర్కొంది.
మెగా ఫ్యాన్స్ టెన్షన్
వరుణ్ గాయపడ్డాడనే వార్త తెలియగానే మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో “త్వరగా కోలుకోవాలి అన్నా” అంటూ పెద్ద ఎత్తున మెసేజ్లు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ అభిమానులు కూడా వరుణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్లు చేస్తున్నారు.
బరి గురించి..
{{/usCountry}}వరుణ్ గాయపడ్డాడనే వార్త తెలియగానే మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో “త్వరగా కోలుకోవాలి అన్నా” అంటూ పెద్ద ఎత్తున మెసేజ్లు పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ అభిమానులు కూడా వరుణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్లు చేస్తున్నారు.
బరి గురించి..
{{/usCountry}}వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న బరి సినిమాను అతని చెల్లి నిహారిక కొణిదెల నిర్మిస్తోంది. ఇది వాలీబాల్ గేమ్ నేపథ్యంలో సాగే సినిమా. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. దీనికి యధు వంశీ డైరెక్టర్. రీసెంట్ గా ఈ మూవీ పూజ కార్యక్రమం జరిగింది. దీనికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.
కొరియన్ కనకరాజు
వరుణ్ తేజ్ మరోవైపు కొరియన్ కనకరాజు అనే సినిమా కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్న వరుణ్ తేజ్ సర్జరీ కారణంగా షూటింగ్ గు దూరమయ్యాడు. తిరిగి అతను మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి ఎంత కాలం పడుతుందన్నదానిపై క్లారిటీ లేదు.
వరుణ్ కెరీర్
2014లో 'ముకుంద' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, ఈ 12 ఏళ్ల ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'ఫిదా', 'తొలిప్రేమ', 'ఎఫ్ 2', 'గని' వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్లకు ఓ బాబు ఉన్నాడు.