...
...
Next Story

గుడ్ న్యూస్.. మెగాస్టార్ సినిమాకు టికెట్ల ధర పెంపు లేనట్లే.. పండగ పూట మేకర్స్ నిర్ణయం.. రేపే ప్రీరిలీజ్ ఈవెంట్

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు మూవీతో వస్తున్న విషయం తెలుసు కదా. ఈ సినిమాకు టికెట్ల ధర పెంపు లేదని చెప్పి మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. పండగ పూట ఫ్యామిలీస్ ను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Published on: Jan 6, 2026, 14:12:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ మధ్య తెలుగులో ఏ పెద్ద హీరో సినిమా రిలీజైనా టికెట్ల ధర పెంపు కామనైపోయింది. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు మూవీ మేకర్స్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. టికెట్ల ధరలను పెంచకూడదని నిర్ణయించడం విశేషం.

సాధారణ టికెట్ల ధరలే..

గుడ్ న్యూస్.. మెగాస్టార్ సినిమాకు టికెట్ల ధర పెంపు లేనట్లే.. పండగ పూట మేకర్స్ నిర్ణయం.. రేపే ప్రీరిలీజ్ ఈవెంట్ (x/Shine_Screens)
గుడ్ న్యూస్.. మెగాస్టార్ సినిమాకు టికెట్ల ధర పెంపు లేనట్లే.. పండగ పూట మేకర్స్ నిర్ణయం.. రేపే ప్రీరిలీజ్ ఈవెంట్ (x/Shine_Screens)

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు, అందులోనూ సంక్రాంతి సీజన్ అంటే టికెట్ రేట్లు పెంచడం కామన్. కానీ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా విషయంలో నిర్మాతలు (సాహు గారపాటి, సుష్మిత కొణిదెల) టికెట్ ధరలను పెంచకూడదని నిర్ణయించుకున్నారు.

ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. పండగకి కుటుంబం అంతా కలిసి సినిమా చూడాలంటే టికెట్ రేట్లు భారం కాకూడదని చిరంజీవి భావించారట. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు నిర్ణయించిన రెగ్యులర్ ధరలకే (సింగిల్ స్క్రీన్స్ రూ. 150-175 రేంజ్) టికెట్లు అమ్ముతారు. ప్రభాస్ 'రాజా సాబ్' లాంటి సినిమాలకు హైక్స్ ఉన్నా, చిరు సినిమాకి లేకపోవడం ఫ్యామిలీ ఆడియెన్స్‌కి పెద్ద రిలీఫ్.

ప్రీ-రిలీజ్ ఈవెంట్

ఇక మన శంకరవరప్రసాద్ గారు సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు అంటే జనవరి 7న (బుధవారం) హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. చిరంజీవి మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి డైలాగ్స్, వెంకటేష్ గెస్ట్ రోల్ ఎంట్రీ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. చిరు-వెంకీ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అవుతాయని టాక్.

సెన్సార్, రన్ టైమ్

ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ది రాజా సాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజులాంటి సినిమాల నుంచి గట్టి పోటీ ఉంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార, కాథరిన్ ట్రెసా నటించారు.

టికెట్ రేట్లు పెంచకుండా సామాన్యుడికి దగ్గరవ్వాలన్న చిరంజీవి నిర్ణయం, ట్రైలర్‌లోని వినోదం చూస్తుంటే.. ఈ సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe