...
...
Next Story

Chiranjeevi Megaverse OTT: మెగాస్టార్ ‘మెగావర్స్’ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్!

Chiranjeevi Megaverse OTT Launch Date: ఓటీటీని షేక్ చేసేందుకు.. టాక్ షోలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి వచ్చేస్తున్నారు. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్టార్ట్ కాబోతున్న ‘మెగావర్స్’ లాంఛ్ డేట్ గురించి లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.

Published on: Nov 22, 2026, 19:08:07 IST
Advertisement

Chiranjeevi Megaverse OTT Launch Date: వెండితెరపై దశాబ్దాలుగా తన యాక్టింగ్ తో ఉర్రూతలూగిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొత్త అవతారం ఎత్తనున్నారు. ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్ టాక్ షో ‘మెగావర్స్’కు చిరు హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ టాక్ షో లాంఛ్ డేట్ కు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

గ్రాండ్ గా లాంఛ్ ఈవెంట్

మెగాస్టార్ ‘మెగావర్స్’ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్!
మెగాస్టార్ ‘మెగావర్స్’ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్.. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్!

మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న టాక్ షో ‘మెగావర్స్’ లాంఛ్ డేట్ వైరల్ గా మారింది. నవంబర్ 30న సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ లో ఈ లాంఛ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందనేది లేటెస్ట్ టాక్. ఈ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేలా నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందని తెలిసింది. ఈ ఈవెంట్ మరో లెవల్ లో ఉంటుందని అంటున్నారు.

స్టార్ హీరోలు

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ గ్రాండ్ గా నిర్వహించబోతున్న మెగావర్స్ లాంఛ్ ఈవెంట్ కు స్టార్ హీరోలు అటెండ్ కాబోతున్నారని సమాచారం. అంతే కాకుండా భారీ సంఖ్యలో మెగా ఫ్యాన్స్ కూడా ఈ ఈవెంట్ కు వస్తున్నారని తెలిసింది. ఈ ఈవెంట్లోనే మెగావర్స్ షో ఫార్మాట్, ఎపిసోడ్ల వివరాలు, స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేస్తారని టాక్.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మెగావర్స్ స్ట్రీమింగ్ తేదీని కూడా ఈ గ్రాండ్ లాంఛ్ ఈవెంట్లోనే ప్రకటించబోతున్నారని తెలిసింది. డిసెంబర్ 13 నుంచి ఈ షో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మెగావర్స్ షో షూటింగ్ ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా స్పీడ్ గా జరుగుతోంది.

నాగర్జున నుంచి ప్రభాస్ వరకు

ఇప్పటికే హోస్ట్ గా చిరంజీవికి అనుభవం ఉంది. గతంలో బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను మెగాస్టార్ నడిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మెగావర్స్ తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు చిరు. ఆయన అప్ కమింగ్ మూవీ ‘కాకా’ 2027 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకునే పనిలో ఉంది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks