...
...
Next Story

Chiranjeevi Remuneration: నెట్‌ఫ్లిక్స్ షో కోసం చిరంజీవికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఓటీటీ చరిత్రలోనే అత్యధికం?

Chiranjeevi Remuneration: నెట్‌ఫ్లిక్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెడుతున్నారన్న వార్త తెలుసు కదా. అయితే ఈ షో కోసం చిరు అందుకోబోయే రెమ్యురేషన్ కు సంబంధించిన వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Published on: Sep 29, 2026, 20:29:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Chiranjeevi Remuneration: మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ స్పేస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గ్లోబల్ ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేసిన ఒక భారీ సెలబ్రిటీ టాక్ షో కోసం ఆయనతో చర్చలు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఒక్క షో కోసం మెగాస్టార్‌కి అక్షరాలా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో గట్టి సంచలనం సృష్టిస్తోంది.

Chiranjeevi Remuneration: నెట్‌ఫ్లిక్స్ షో కోసం చిరంజీవికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఓటీటీ చరిత్రలోనే అత్యధికం?
Chiranjeevi Remuneration: నెట్‌ఫ్లిక్స్ షో కోసం చిరంజీవికి కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఓటీటీ చరిత్రలోనే అత్యధికం?

ఇంతవరకు ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే ఏ సెలబ్రిటీకి ఇవ్వని రీతిలో ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయి.

బీవీఎస్ రవి కాన్సెప్ట్.. సుస్మిత కొణిదెల ప్రొడక్షన్

నందమూరి బాలకృష్ణ ఆహాలో చేసిన 'అన్‌స్టాపబుల్' టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ షోకి కాన్సెప్ట్ రైటర్‌గా పనిచేసిన బీవీఎస్ రవి.. ఇప్పుడు చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ షోకి కూడా అదిరిపోయే కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రతిష్టాత్మక టాక్ షో ప్రొడక్షన్ బాధ్యతలను చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో గ్లోబల్ స్టాండర్డ్స్‌లో ఈ షోని ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

టీవీ నుంచి గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వరకు..

చిరంజీవికి బుల్లితెరపై కూడా మంచి అనుభవం ఉంది. గతంలో 'మీలో ఎవరూ కోటీశ్వరుడు' షోకి హోస్ట్‌గా వ్యవహరించి టీవీ ఆడియన్స్‌ని బాగా అలరించారు. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం.

మరోవైపు చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీతో 'కాకా' అనే హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ సినిమా టాకీ పార్ట్‌ని నవంబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని సంక్రాంతి 2027 కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు వేగవంతం చేశారు. ఒకవైపు సినిమాలు, మరోవైపు బిగ్ ఓటీటీ షోతో మెగాస్టార్ ఫ్యాన్స్‌కి రాబోయే రోజుల్లో పూనకాలే అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks