...
...
Next Story

మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ.. కుడి భుజానికి కట్టు అందుకే.. ఫ్యాన్స్ ఆందోళనతో క్లారిటీ ఇచ్చిన చిరు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుడి భుజానికి చిన్నపాటి శస్త్రచికిత్స జరిగింది. ప్రముఖ ఆర్థ్రోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్ ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. చేతికి కట్టుతో కనిపించిన చిరును చూసి అభిమానులు ఆందోళన చెందగా.. అతడు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

Published on: Feb 16, 2026, 21:55:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. చిరంజీవి ఇటీవల కుడి భుజానికి ఒక చిన్నపాటి కీ-హోల్ సర్జరీ (ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ) చేయించుకున్నాడు. ప్రముఖ సర్జన్ డాక్టర్ నితిన్ పర్యవేక్షణలో ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని చిరు వెల్లడిస్తూ తన ఆరోగ్య విషయమై ఆందోళన చెందుతున్న అభిమానులకు భరోసా ఇచ్చాడు.

చేతికి స్లింగ్.. ఆందోళనలో అభిమానులు

మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ.. కుడి భుజానికి కట్టు అందుకే.. ఫ్యాన్స్ ఆందోళనతో క్లారిటీ ఇచ్చిన చిరు
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ.. కుడి భుజానికి కట్టు అందుకే.. ఫ్యాన్స్ ఆందోళనతో క్లారిటీ ఇచ్చిన చిరు

గత కొద్ది రోజులుగా చిరంజీవి కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ వేసుకుని కనిపిస్తున్నాడు. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్ కుటుంబ సమేతంగా చిరంజీవి నివాసానికి వెళ్ళినప్పుడు, అలాగే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చిరు చేతికి కట్టుతో కనిపించాడు. ముఖ్యంగా అల్లు శిరీష్ పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోల్లో ఆ బ్యాండేజ్ స్పష్టంగా కనిపించింది. దీంతో మెగాస్టార్‌కి ఏమైంది? షూటింగ్‌లో గాయపడ్డారా? అంటూ అభిమానులు ఆందోళన చెందారు.

“నేను బాగున్నాను” అంటూ చిరు క్లారిటీ

అభిమానుల సందేహాలకు చెక్ పెడుతూ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించాడు. డాక్టర్ నితిన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. "నా చేతికి ఉన్న బ్యాండేజ్ చూసి చాలా మంది శ్రేయోభిలాషులు, మిత్రులు నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. మీ అందరికీ చెప్పేది ఏంటంటే.. నా భుజానికి చిన్నపాటి కీ-హోల్ సర్జరీ జరిగింది. డాక్టర్ నితిన్ పర్యవేక్షణలో ఈ ప్రొసీజర్ చాలా స్మూత్‌గా, విజయవంతంగా పూర్తయింది. ఆయన నైపుణ్యానికి, తీసుకున్న శ్రద్ధకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇప్పుడు కోలుకుంటున్నాను, నా రోజువారీ పనులను కూడా మొదలుపెట్టాను" అని ట్వీట్ చేశాడు. నొప్పి ఉన్నా కూడా చిరు ఎప్పటిలాగే చిరునవ్వుతో అందరినీ పలకరించడం విశేషం.

'విశ్వంభర' షూటింగ్ ఎఫెక్ట్?

ఇందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్, స్టంట్స్ ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లు చేసేటప్పుడు స్టార్ హీరోలకు భుజం బెణకడం లేదా ఒత్తిడికి గురవడం సహజం. బహుశా షూటింగ్ సమయంలో జరిగిన స్ట్రెయిన్ వల్లే ఈ చిన్న సర్జరీ అవసరమై ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

త్వరలోనే మళ్ళీ షూటింగ్‌కి..

ఈ సర్జరీ వల్ల పెద్దగా ప్రమాదం లేదని, చిరు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని సమాచారం. త్వరలోనే అతడు 'విశ్వంభర' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో, ప్రమోషన్లలో పాల్గొననున్నాడు. మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని, పూర్తి ఫిట్‌నెస్ తో మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని చిరు ఇచ్చిన క్లారిటీతో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks