Messi Movie First Look And Glimpse Launch Event: ధామా టేల్స్ బ్యానర్‌పై ఆకర్ష ఆలపాటి సమర్పణలో నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా మెస్సీ- లవ్ ఫ్రమ్ ఇండియా. ఈ సినిమాను ఆకర్ష ఆలపాటి నిర్మాతగా నిర్మిస్తున్నారు.
మెస్సీ సినిమా నటీనటులు

ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మెస్సీ చిత్రంలో జమునా అబ్దు రెహ్మాన్, విజయన్ , సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అందించారు.
వినాయక చవితి సందర్భంగా మెస్సీ ఫస్ట్ లుక్ రిలీజ్
నౌఫల్ అబ్దుల్లా ఎడిటింగ్ చేయగా అశోక్ మల్లికార్జున వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మెస్సీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అయితే, ఈ గ్లింప్స్‌ను స్కూల్ పిల్లల చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా మెస్సీ లవ్ ఫ్రమ్ ఇండియా సినిమా విడుదల కానుంది.
చిన్నతనం నుంచే క్రియేటివ్‌గా
ఈ సందర్భంగా నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా చిన్నతనం నుంచి క్రియేటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాను. ఇదే మార్గంలో చిన్న వారిని బాగా ప్రోత్సహించాలని అనుకున్నాను" అని అన్నారు.
మరిన్ని వినూత్న ఆలోచనలు ఉన్నాయి
"అదే విధంగా మలయాళ చిత్రమైన మెస్సీ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాను. ఈ సినిమా కోసం నాకు సపోర్ట్‌గా నిలిచిన నా బృందం అందరికీ థాంక్స్. మా దగ్గర మరిన్ని వినూత్న ఆలోచనలు ఉన్నాయి, ఇటువంటి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నాము" అని ప్రొడ్యూసర్ ఆకర్ష ఆలపాటి తెలిపారు.
బాలలదినోత్సవం సందర్భంగా రిలీజ్
{{/usCountry}}"అదే విధంగా మలయాళ చిత్రమైన మెస్సీ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాను. ఈ సినిమా కోసం నాకు సపోర్ట్‌గా నిలిచిన నా బృందం అందరికీ థాంక్స్. మా దగ్గర మరిన్ని వినూత్న ఆలోచనలు ఉన్నాయి, ఇటువంటి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నాము" అని ప్రొడ్యూసర్ ఆకర్ష ఆలపాటి తెలిపారు.
బాలలదినోత్సవం సందర్భంగా రిలీజ్
{{/usCountry}}"పీవీఆర్ ఉదయ్, వెంకట్ గారు మాకు మంచి సపోర్ట్ అందించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14వ తేదీన మెస్సి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నాము. ప్రేక్షకులు సినిమాను ఆదరించి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అని లేడి ప్రొడ్యూసర్ ఆకర్ష ఆలపాటి కోరారు.
ఆశీర్వదించాల్సిందిగా
ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరవింద్ బత్తిని మాట్లాడుతూ.. "మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థాంక్స్. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
మెస్సీలాగే సినిమా ఆడాలి
అర్జున్ మాట్లాడుతూ.. "నేను ఈ కార్యక్రమానికి వచ్చిన మొదటి కారణం ఆకర్ష. మెస్సీ సినిమా గురించి చెప్పాలి అంటే ప్లేయర్ ఎలా బాగా ఆడతారు అలాగే సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ ఇచ్చిన మీడియాకు థాంక్స్. ధామా టేల్స్ నుంచి రానున్న ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ధామా టేల్స్ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ మరింత ముందుకు వెళ్లనుంది" అని వెల్లడించారు.